Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుందని తెలుసా..?

జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 16 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుందని తెలుసా..?

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 16 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ సంబంధమైన ఒకటి రెండు ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆచితూచి ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. రాజకీయ నాయకులు గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం..

ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఆలోచన చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.

మిథునం..

ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొందరు బంధువులకు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. దూర ప్రాంతంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.

కర్కాటకం..

మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న బాకీ ఒకటి వసూలు అవుతుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితురాలికి విందు ఏర్పాటు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

సింహం..

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆదాయానికి సంబంధించిన పనులు మాత్రం పూర్తవుతాయి. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. బందు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఐటీ వారు మంచి ఉద్యోగాల్లోకి మారటానికి అవకాశం ఉంది.

కన్య..

ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఒకదానికి పరిష్కారం కనిపిస్తుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు బాగా ప్రయోజనం కలిగించే పనులు చేస్తారు.

తుల..

ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదిగే సూచనలు ఉన్నాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంది. అత్తింటి కుటుంబం నుంచి దుర్వార్త వినే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిస్తారు.

ఈ రాశి వారికి ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం (Daily Horoscope)..

వృశ్చికం..

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ పరంగా దూరప్రాంతం నుంచి మంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు..

వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. బంధువులకు ఆర్థికంగా సహాయం చేయవలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు వచ్చే అవకాశముంది.

మకరం..

ఉద్యోగంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యల నుంచి బయటపడతారు. దగ్గర బంధువులతో అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పిల్లలకు సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కుంభం..

ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి అనుకోకుండా బయటపడతారు. ఉద్యోగ జీవితం ఎ టువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు శక్తికి మించి సహాయం చేస్తారు. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండండి. ప్రేమలో ముందడుగు వేస్తారు.

మీనం..

కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు దూరప్రాంతం నుంచి ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.