Home / అంతర్జాతీయం
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అయితే భారతీయ ప్రయాణికులకు భాషా సమస్య, ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం పాక్ జీడీపీ 3.5 శాతంగా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ మంగళవారం నాడు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రపంచబ్యాంకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు శాతం దాటితే మహా గొప్ప అని పెదవి విరిచింది. దీనికి వరల్డ్ బ్యాంకు ఇస్తున్న వివరణ ఇలా ఉంది.
ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు.
విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల ర్యాంకులను ఈసీఏ ఇంటర్నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2023ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో న్యూయార్కు అగ్రస్థానంలో నిలిచింది.
ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో లోపం కారణంగా రష్యాలోని మగదాన్‌కు దారి మళ్లించారు. ఎయిర్ ఇండియా అధికారి తెలిపిన వివరాల ప్రకారం విమానం రష్యాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారని ఒక అధికారి తెలిపారు.
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రష్యా నియంత్రణలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లో సోవియట్ కాలం నాటి భారీ కట్టడం అయిన నోవా కఖోవ్కా డ్యామ్ వీడియో తెగిపోయినట్లు వీడియో వైరల్ అయింది. రష్యా, ఉక్రెయిన్లు ఉద్దేశపూర్వక దాడికి పాల్పడ్డారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.వీడియోలు డ్యామ్ అవశేషాల గుండా నీరు ప్రవహించడాన్ని చూపించాయి.
పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్ లో గత మూడు రోజుల హింసాత్మక నిరసనలతో 16 మంది మరణించారు. ప్రతిపక్ష నేత ఉస్మాన్ సోంకోకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత నిరసనలు చెలరేగినట్లు అంతర్గత మంత్రి ఆంటోయిన్ డియోమ్ తెలిపారు.
హైతీలో వారాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగావిస్తృతంగా వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మరణించారు. ఎనిమిది మంది తప్పిపోయారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు.
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో 80 మంది పాఠశాల బాలికలు విషప్రయోగం చేసి ఆసుపత్రి పాలైనట్లు స్థానిక విద్యాశాఖ అధికారి ఆదివారం తెలిపారు. ఆగస్ట్ 2021లో తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మరియు ఆఫ్ఘన్ మహిళలు మరియు బాలికల హక్కులు మరియు స్వేచ్ఛలపై వారి అణిచివేత ప్రారంభించిన తర్వాత ఇటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.