Last Updated:

Tomato Rice: టమోటో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం!

సాధారణంగా మనము రోజు ఎదో ఒక టిఫిన్ చేసుకొని తింటాం. ఒక్కోసారి టిఫిన్ చేసుకోవడానికి టైం కూడా ఉండదు. ఒక్కోసారి టిఫిన్ తొందరగా ఐపోతే బావుండనిపిస్తుంది. అలాంటి టిఫిన్ ఇక్కడ  చదివి తెలుసుకుందాం. ఐదు నుంచి ఎనిమిది నిముషల్లోనే ఐపోతుంది.

Tomato Rice: టమోటో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం!

Tomato Rice: సాధారణంగా మనము రోజు ఎదో ఒక టిఫిన్ చేసుకొని తింటాం. ఒక్కోసారి టిఫిన్ చేసుకోవడానికి టైం కూడా ఉండదు. ఒక్కోసారి టిఫిన్ తొందరగా ఐపోతే బావుండనిపిస్తుంది. అలాంటి టిఫిన్ ఇక్కడ  చదివి తెలుసుకుందాం. ఐదు నుంచి ఎనిమిది నిముషల్లోనే ఐపోతుంది. ముందుగా టమోటో రైస్ కు కావలిసిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..
2 టేబుల్ స్పూన్లు ఆయిల్
1 బిర్యాని ఆకు
1/2 ఇంచ్ దాల్చిన చెక్క
2 లవంగాలు
1ఇలాచి
2 రెబ్బల కరివేపాకు
పుదీనా కొంచెం
2 ఉల్లిపాయలు చిన్నవి
5 మిరపకాయలు
1/2 టీ స్పూను పసుపు
1 టీ స్పూను అల్లం పేస్ట్
3 టమోటోలు
1 టేబుల్ స్పూను కారం
1/4 టీ స్పూను గరం మసాలా
సరిపడినంత ఉప్పు
2 కప్పులు అన్నం

తయారీ విధానం..
గ్యాస్ మీద పాన్ పెట్టి దానిలో నూనె వేసి, అది వేడయ్యాక బిర్యాని ఆకులు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, కరివేపాకు అన్ని వేసి బాగా వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలను,  మిరపకాయలు, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత టమోటోలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికిన తరువాత వాటిలో పుదీనా, గరంమసాలా, కారం, సరి పడినంత ఉప్పు వేసి కలిపాక, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే టమోటో రైస్ రెడీ.

ఇవి కూడా చదవండి: