Home / టాలీవుడ్
తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్ క్రియేట్ చేసింది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్ కు మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విడుదలకు ముందే మరే ఇతర భారతీయ చిత్రాలకు లేని సరికొత్త రికార్డులను కల్కి నెలకొల్పుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దర్శకత్వం వహించిన RRR చిత్రం దేశవిదేశాల్లో విమర్శకులను మెప్పించింది. గత సంవత్సరం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకుంది. తాజాగా అకాడమీ అతనిని తన జ్యూరీలో చేరమని ఆహ్వానించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని చిరంజీవికి కూడా అందించింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అబుదబిలోని బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా లభించిన వెంటనే ఆయన బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించినట్లు తన ఎక్స్ ఖాతాలో వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నటి హేమ, అషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
బెంగళూరులో రేవ్‌పార్టీ గుట్టురట్టైంది. బర్త్‌డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. రేవ్ పార్టీలో ప్రముఖులు, బడాబాబులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లులను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత అట్లీతో కలిసి పని చేస్తారని తెలుస్తోంది.
కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రం ట్రైలర్ రిలీజయింది. యాక్షన్, రొమాన్స్ కలగలిపి మాస్ మసాలా దట్టించి ఉన్న ఈ ట్రయిలర్ సంక్రాంతి పండక్కి అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు. నాగార్జున మాస్ పాత్రలో ఈజీగా నటించారు.