Home / టాలీవుడ్
“ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో పుష్ప 2 లో నటిస్తుంది.
మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేత ఒకప్పటి మిస్ యూఏపీ. ఫ్యాషన్ రంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీలో నటించి మెప్పించింది.
అలేఖ్య హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా పాల్గొని తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు మరింత చేరువైంది. కాగా హారిక బిగ్ బాస్ తర్వాత నుండి తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసిందనే చెప్పుకోవాలి.
పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు. తెలుగు ఇండస్ట్రిలో రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.
Shaakuntalam Movie Review : సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. మోహన్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిష్షు సేన్ గుప్తా తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ […]
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన
మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కాగా వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు.. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో
టాలీవుడ్ లోకి ఇష్టం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో జతకట్టి..
కరోనా తర్వాత నుంచి చాలామంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు.. వ్యూయర్స్ అభిరుచికి తగ్గట్టుగా ప్రతీ వారం కొత్త చిత్రాలను విడుదల చేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 31 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.