Published On:

Trisha Reacts on Trolls: మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది – త్రిష షాకింగ్‌ పోస్ట్‌

Trisha Reacts on Trolls: మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది – త్రిష షాకింగ్‌ పోస్ట్‌

Trisha Slams Trolls With Cryptic Post: తమిళ స్టార్‌ హీరో అజిత్‌, త్రిష జంటగా నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ గురువారం రిలీజ్‌ అయ్యింది. తమిళ, తెలుగు భాషలో ఒకేసారి తెరెక్కిన ఈ సినిమా గురువారం (ఏప్రిల్‌ 10) థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా తెలుగులో మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. ఇందులో త్రిష పాత్రలో రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి. ఇందులో ఆమె నటన చాలా బాగుందని, అందంగా కూడా కనిపించారంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొందరు ఆమె నటనపై విమర్శలు చేస్తున్నారు.

 

త్రిష యాక్టింగ్‌ ఏమాత్రం బాగాలేదని, పైగా తమిళం తెలిసినప్పటికి ఆమెకు మరోకరు డబ్బింగ్‌ చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడానికి త్రిషనే కారణమంటూ, ఇందులో మైనస్‌ ఏదైన ఉందంటే త్రిషను హీరోయిన్‌గా పెట్టడమే అంటూ సోషల్‌ మీడియాలో నెగిటివిటీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక తనపై వస్తున్న నెగిటివిటీ, ట్రోల్స్‌పై తాజాగా త్రిష స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. మనుషులు ఇంత విషపూరితంగా ఎలా ఉంటారు అంటూ అసహనం చూపించింది.

 

“విషపూరితమైన మనుషులు.. అసలు మీరు ఎలా జీవిస్తున్నారు? మీకు ప్రశాంతమైన నిద్ర ఎలా పడుతుంది. ఖాళీగా కూర్చుని సోషల్‌ మీడియాలో పిచ్చిపిచ్చి పోస్టుల చేయడమే మీ పనా? నిజంగా మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. అలాగే మీ చూట్టూ, మీతో పాటు జీవించే వారిని తలుచుకుంటుంటే బాధగాకూడా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

అయితే త్రిష ఇలా ట్రోలర్స్‌, నెగిటివ్‌ కామెంట్స్‌ స్పందించడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ నెగిటివ్‌ కామెంట్స్‌ చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి ప్రవర్తన ఏమాత్రం సరైనది కాదని, అలాంటి వారి మాటలు తాను అస్సలు పట్టించుకోనన చెప్పి ట్రోలర్స్‌ దిమ్మ తిరగే కౌంటర్‌ ఇచ్చింది. ఇదిలా ఉంటే త్రిష ప్రస్తుతం విశ్వంభర మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో ఆమె జతకట్టింది. స్టాలిన్ సినిమాలో చిరంజీవి, త్రిష జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి త్రిష చిరు సరసన నటిస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.