Home / టాలీవుడ్
డీజే టిల్లు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర బృందం తీపి కబురు చెప్పింది. తాజాగా డీజె టిల్లు సీక్వెల్ షూటింగ్ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్లు వైరల్ అయిన విషయం విదితమే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ టైటిల్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.
మెన్ ఆఫ్ మాసెస్ గా పేరుతెచ్చుకున్న బాలయ్య ‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. అయితే ప్రస్తుతం బాలయ్య హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిన విషయమే. సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాకు ఉత్తమ నటిగా ఎంపికై నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తాత సీనియర్ డైరెక్టర్, రేడియో డబ్బింగ్ కళాకారుడు, నటుడు ఎస్వీ రమణన్ తుదిశ్వాస విడిచారు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కీలక పాత్ర పోషించారు. మొదట్లో దీన్ని చేయడానికి ఇష్టపడకపోయినా చిరు కోసమే చేశారు. తన ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో, ఈ సినిమాలో నటించడానికి పూరి విముఖత చూపాడంటూ చిరు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాదర్ పై అటు పరిశ్రమ, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి కూడ ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్ అయినప్పటికీ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఆదిపురుష్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంఛ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.అలాగే ఆ సినిమా నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.దీనితో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అల్లు అర్జున్‌కు డిమాండ్ బాగా పెరిగింది.ఐతే తాజాగా అల్లు అర్జున్ గండిపేటలో అల్లు స్టూడియోను నిర్మిస్తున్నారని అనే వార్తా సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది.
‘ఉప్పెన’తో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ యువ నటుడు రంగ రంగ వైభవంగా మూవీతో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో దసరా కానుకగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.