Prabhas: కృష్ణంరాజు సంస్కరణ సభలో.. యాభై రకాల వంటలు చేపించిన ప్రభాస్ ఫ్యామిలీ
మొగల్తూరులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో సందడిగా మారింది. ఎక్కడ చూసినా మొగల్తూరులో ప్రభాస్ అభిమానులే కనిపిస్తున్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభా కార్యక్రమాలు జరిగాయి.
Mogalturu: మొగల్తూరులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో సందడిగా మారింది. ఎక్కడ చూసినా మొగల్తూరులో ప్రభాస్ అభిమానులే కనిపిస్తున్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభా కార్యక్రమాలు జరిగాయి. ఈ సంస్మరణ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, కృష్ణంరాజు అభిమానులు హాజరయ్యారు.
రెబెల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా కొన్ని లక్షల మందికి సరిపోయే వంటకాలను సిద్దం చేసి, సభకు వచ్చిన వారికి టన్నుల కొద్దీ వంటకాలను వడ్డించారు. ఈ వంట మెను చూసుకుంటే 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల చికెన్ కర్రీ, 6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసుతో పాటు 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫ్రై, 2 లక్షల బూరెలు తయారు చేశారు. ఇవి మాత్రమే కాకుండా మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలని కృష్ణం రాజు సంస్కరణ సభలో వచ్చిన అతిధులకు వడ్డించారు.