Home / టాలీవుడ్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ హౌస్‌తో రెండు చిత్రాలకు సంతకం చేసి ఈ సంస్దతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం యాడ్ అయ్యింది. భారత మాజీ క్రికెటర్ యవరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ ఈ మూవీలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
పఠాన్ టీజర్లో యాక్షన్ సీన్లు, ఫైట్స్ హైలెట్‌గా కనిపించాయి. రక్తంతో తడిసిన దుస్తులు.. విమానాలు, హెలికాప్టర్లతో తెరకెక్కించిన సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను తలదన్నెలా ఉన్నాయి . ఇక బైక్ ఛేజింగ్ సీన్లు..ఐతే చెప్పే పనే లేదు.పర్వత ప్రాంతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు టెక్నికల్ పరంగా చాలా బాగున్నాయి.
అతిచిన్న వయసులో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో హన్సిక ఒకరు. గత కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి గురించి పుకార్లు వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే నవంబర్ 2న, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ అయిన సోహెల్ ఖతురియాను వివాహమాడనున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున నటించిన 'గాడ్ ఫాదర్' మరియు ‘ది ఘోస్ట్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను నమోదు చేశాయి. అయితే ఈ చిత్రాలు తాజాగా ఓటీటీ వేదికగానూ అలరించనున్నాయి.
నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి మంజిమా మోహన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. వరుడు మరెవరో కాదండి కోలీవుడ్ సీనియర్ స్టార్, "సీతాకోక చిలుకలు" మూవీ ఫేమ్ కార్తీక్ తనయుడు, "కడలి" చిత్రం హీరో గౌతమ్ కార్తీక్.
ముఖ్యంగా రష్మి అభిమానులు ఐతే చెప్పాలిసిన అవసరమే లేదు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంగళవారం ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.
ఈ సోదాలు జరిగినట్టు మంగళవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. ఈ విషయం మీద GST అధికారులు కూడా ఎలాంటి వివరాలు బయటకు రానివ్వలేదు.
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు చేసిన చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై యశోద సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరపైకి ఎక్కిస్తున్న హరిహరవీరమల్లు చిత్ర షూటింగ్ హైదరాబాదు రామోజీ ఫిలింసిటీలో ఫైట్ సీక్వెన్స్ ను ఎక్కిస్తున్నారు. క్రిష్, పవన్ టీం ఇటీవలే వర్క్ షాపులో కూడా పాల్గొన్నారు. సెట్స్ పైకి ఎక్కిన ఈ సినిమా షూటింగ్ తొలినుండి అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.