Mandaadi: సుహాస్ హీరో కాదట.. క్లారిటీ వచ్చేసింది

Mandaadi: కలర్ ఫోటో సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు సుహాస్. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా మారిన ఈ కుర్ర హీరో.. కలర్ ఫోటో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఈ సినిమా తర్వాత కేవలం హీరోగానే కాకుండా కమెడియన్ గా.. విలన్ గా నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హిట్ 2 లో సుహాస్ విలనిజానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ప్రస్తుతం సుహాస్ ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క విలన్ గా నటిస్తూ బిజీగా మారాడు. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా సుహాస్ అడుగుపెడుతున్నాడు. తమిళ్ కమెడియన్ సూరి హీరోగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం మండాడి. మధిమారన్ పుగలేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా తమిళ్ లో మాత్రే సుహాస్ విలన్ గా చేస్తున్నాడు అని.. తెలుగులో సూరి విలన్ గా కనిపిస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కుర్ర హీరో క్లారిటీ ఇచ్చాడు.
” హలో… నా తరువాతి సినిమా మండాడి గురించి ఒక చిన్న క్లారిఫికేషన్. అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా గురించిన రూమర్స్ చాలా వస్తున్నాయి. నేను ఈ సినిమాలో ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తున్నాను. సూరి అన్న నాయకుడుగా కనిపిస్తున్నాడు. ” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో. సుహాస్ విలన్ గానే కనిపిస్తున్నాడు అని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుహాస్ తమిళ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.