Rakul Preet Singh: పూరీ జగన్నాథ్ ఫోన్ చేసి ఆఫర్ ఇస్తే.. కుదరదన్నాను, ఎందుకంటే: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh About Puri Jagannath Movie: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌తో బిజీ బిజీగా ఉంది. గతేడాది వైవాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె ఆ వెంటనే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ఇలా వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె కెరీర్ ప్రారంభం నుంచి తన వర్క్ లైఫ్‌తో పాటు ప్రేమ, పెళ్లిపై స్పందించింది.
కన్నడ చిత్రంతో ఎంట్రీ
ఆమె మాట్లాడుతూ.. “మోడలింగ్ రోజుల్లోనే తనకు సినిమా ఆఫర్స్ వచ్చాయంది. అయితే కెరీర్ ప్రారంభంలోనే స్టార్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ సినిమాని రిజెక్ట్ చేశానని చెప్పి షాకిచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “మోడలింగ్ చేస్తున్న టైంలోనే నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు నా ఫోటోలు చూసి కన్నడ డైరెక్టర్ కాల్ చేశారు. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు నాకు దక్షిణాది పరిశ్రమపై ఏమాత్రం అవగాహన లేదు. దీంతో సినిమా చేయనా? వద్దా? అని ఎంతో ఆలోచించా. ఆ డైరెక్టర్ మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో ‘గిల్లి’లో నటించాను. సినిమా షూటింగ్ వల్ల నా స్టడీస్ డిస్టబ్ అయ్యాయి. కానీ, అప్పుడే నాకు నటన, సినిమాలపై ఆసక్తి పెరిగింది. దీంతో చదువు పూర్తయ్యాక సినీరంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా” అని చెప్పింది.
అవగాహన లేక పెద్ద తప్పు చేశాను
అయితే “గిల్లి మూవీ రిలీజ్ అయ్యాక అది చూసి నాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫోన్ చేశారు. తన మూవీలో ఆఫర్ ఇస్తూ 70 రోజుల కాల్షీట్ అడిగారు. అప్పుడు నాకు డిగ్రీ పరీక్షలు ఉండటంతో నేను కుదరదని చెప్పాను. అలాగే నాకు తెలుగు రాదని సాకు చెప్పి చేయననని చెప్పాను. ఆయన నా ఇబ్బంది అర్థం చేసుకుని మళ్లీ నాకు ఫోన్ చేయలేదు. కానీ నాన్నకు ఫోన్ చేసి కాస్తా కాస్తా అసహనం చూపించారట. సినిమా అవకాశాలు ఎప్పుడు రావు, వచ్చినప్పుడు చేజార్చుకోవద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అప్పుడు నాకు దక్షిణాది పరిశ్రమ గురించి తెలియదు. కానీ, ఆ తర్వాత ఆయనకు నో చెప్పి తప్పుచేశాను అనిపించింది. నేను తీసుకున్న తప్పుడ నిర్ణయాల్లో ఇది ఒకటి. ఆయన సినిమానే కాదు, కెరీర్‌లో ప్రారంభంలో అలా ఎన్నో ఆఫర్స్ వదులుకున్నాను” అని చెప్పుకొచ్చింది. అయితే పూరీ జగన్నాథ్ ఆఫర్‌ను మిస్ అయిన చిత్రమే దేశముదురు అట.
బ్రేకప్ నుంచి చాలా నేర్చుకున్నా
పోకిరి తర్వాత ఈ సినిమా చేస్తున్న హీరోయిన్‌గా మొదట రకుల్ ప్రీత్ సింగ్‌ను అనుకున్నారట. ఆమె చేయనని చెప్పడంతో హన్సికను తీసుకున్నారు. అనంతరం రకుల్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. “జీవితంలో ప్రతి ఒక్కరికి బాధకరమైన బ్రేకప్స్ ఉంటాయంది. అయితే వాటి నుంచి జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్చకోవాలన్నారు. “నాకు జీవితంలో హార్ట్స్ బ్రేక్ సంఘటన ఎదురైంది. అప్పుడు దాని నుంచి నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశా. ఒక వ్యక్తిని బాగా నమ్మి.. విడిపోతే దానంత భయంకరైమనది మరోకటి ఉండదు. ప్రేమ చాలా గొప్పది. అలా అని జీవితంలో నీకున్న లోటును వేరే వ్యక్తి పూర్తి చేస్తాడని ఎప్పుడూ అనుకోకూడదు. నీ జీవితానకిఇ సంబంధించి నువ్వే అన్ని తెలుసుకోవాలి” అని పేర్కొంది.