Last Updated:

Oscars95: ఆస్కార్‌ 2023లో ఎక్కువ అవార్డులు అందుకున్న సినిమా ఇదే!

Oscars95: ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా ముగిశాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినితారలు హాజరయ్యారు.

Oscars95: ఆస్కార్‌ 2023లో ఎక్కువ అవార్డులు అందుకున్న సినిమా ఇదే!

Oscars95: ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా ముగిశాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినితారలు హాజరయ్యారు.

ఏ సినిమాకు ఎక్కువ అవార్డులు అంటే? (Oscars95)

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్స్ లో ఒక సినిమా ఒకటి కంటే ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.

అమెరికన్ సైకలాజికల్ డ్రామా ‘ది వేల్’ సినిమా రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ‘మమ్మీ’ సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘బ్రెండన్ ఫ్రేజర్’.. ది వేల్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నాడు. అలాగే ఇదే సినిమాకు మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో కూడా అవార్డుని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఎక్కువ అవార్డులు అందుకున్న సినిమా గా ‘అల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో నాలుగు ఆస్కార్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వార్ 1 నేపథ్యంతో వచ్చిన ఈ జర్మన్ మూవీని ఎడ్వర్డ్ బెర్గెర్ డైరెక్ట్ చేశాడు.

ఇక ఆస్కార్ లో అత్యధిక అవార్డులు అందుకున్న చిత్రంగా ఎవరీ థింగ్ ఎవరీ వేర్ అల్ ఎట్ ఒన్స్ నిలిచింది. మొత్తం 7 కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను అందుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డ్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్ లో కూడా ఈ సినిమా అధిక స్థాయిలో అవార్డులను అందుకుంటూ వచ్చింది. ఈ సినిమాని డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ రచించి, డైరెక్ట్ చేశారు. మిచెల్ యో మెయిన్ లీడ్ లో నటించగా.. కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ ప్రధాన పత్రాలు పోషించారు. మల్టీవర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.