Naatu Naatu Song: ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డ్.. రెపరెపలాడిన తెలుగు కీర్తి పతాక
Naatu Naatu Song: ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందోత్సహల్లో మునిగిపోయింది.
Naatu Naatu Song:ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందోత్సహల్లో మునిగిపోయింది.
'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023
నాటు నాటు కు ఆస్కార్ అవార్డు.. (Naatu Naatu Song)
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘అప్లాజ్,’ ‘లిప్ట్ మి అప్ ‘, ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’ వంటి పాటలను వెనక్కి తట్టి ఆస్కార్ ను ఆర్ఆర్ఆర్ సాంగ్ సొంతం చేసుకుంది. నాటు నాటు సాంగ్ ను అవార్డును ప్రకటించగానే.. డాల్బీ థియేటర్ చప్పట్లతో మారుమోగింది. దీంతో ప్రపంచ వేదికపై తెలుగు సినీ కీర్తి పతాక రెపరెపలాడింది. ఖండాంతరాలకు వ్యాపించిన తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది.
సూపర్ లిరిక్స్..
ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకు రచయిత చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఈ పాటకు సంగీతం మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ డ్యాన్స్ తో దుమ్మురేపారు.
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు. ఇక భారతీయ చిత్రం ఆస్కార్ వేడుకల్లో మెరిసింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ వేడుకలో కార్తీకి ఆస్కార్ ను సగర్వంగా అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఆస్కార్ కావడం విశేషం.
పాటను పరిచయం చేసిన దీపిక పదుకొణె..
ఈ ఆస్కార్ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు హాజరయ్యారు. అమెలికాలోని లాస్ ఎంజెల్స్ లో ఈ వేడుక అట్టహాసంగా సాగుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించారు.ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ కథనాయిక దీపిక పదుకొణె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ని ఆమె ఆస్కార్ వేడుకలో పరిచయం చేశారు. ఆ పాట నేపథ్యాన్ని ఈ వేడుకకు హాజరైన వారికి వివరించారు. ఈ వేడుకకుప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎంఎం కీరవాణి స్వరాలు అందించిన ఈ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఓ ఊపు ఊపింది. ఇక ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు వేరే లేవల్ అంతే. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆస్కార్ ఈవెంట్ ని మొదలు పెడుతూ హోస్ట్ గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ గురించి మాట్లాడిన తరువాత ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు స్టేజి పై మరికొందరు డాన్సర్స్ నాటు నాటు స్టెప్పు వేశాడు.