Published On:

Hero Nani: ఆ తర్వాత సినిమా డిజాస్టర్‌ అని డిక్లేర్‌ చేయండి – తొలిరోజు రివ్యూలపై నాని కామెంట్స్‌

Hero Nani: ఆ తర్వాత సినిమా డిజాస్టర్‌ అని డిక్లేర్‌ చేయండి – తొలిరోజు రివ్యూలపై నాని కామెంట్స్‌

Nani About Movie Reviews on First Day: విడుదలైన మొదటి రోజు, ఫస్ట్‌ షోకే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభాం చూపుతోందని టాలీవుడ్‌ చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ఇప్పటికే పలువురు హీరోలు, దర్శక-నిర్మాతలు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై హీరో నాని కూడా స్పందించారు. ఆయన లేటెస్ట్‌ మూవీ హిట్‌ 3 ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది. దీనికి నాని స్పందిస్తూ ఇలా అన్నారు. “ఒకప్పుడు అయితే ఒకే. కానీ ఇప్పుడు దీనికి ఆపడం చాలా కష్టం. ఎందుకు ఆపాలి.. ఎవరిని ఆపాలి.. ఎలా ఆపాలి. ఇప్పుడు ఎవరీని ఆపలేం.

 

సోషల్‌ మీడియా వచ్చాక పరిస్థితి అందరి చేతులు దాటిపోయాయి. ఎవరికి ఏది అనిపిస్తే అది పెడుతున్నారు, చెబుతున్నారు. అయితే ఓ సన్నివేశాం, ఓ పాట నచ్చలేదు అని చెప్పోచ్చు. కానీ ఈ సినిమా ఆడదు అని డిసైడ్‌ చేయొద్దని నా విజ్ఞప్తి. వారం.. పది రోజుల పాటు ఏదైనా సినిమాలు ఎవరూ చూడకపోతే అప్పుడు డిజాస్టర్‌ అని డిక్లేర్‌ చేయండి” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘అబ్బో.. తలనొప్పి వచ్చేసింది’ కొన్ని సినిమాల విషయంలో కొందరు సోసల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు చూశానని, వ్యక్తిగంగా ఓకే కానీ, ప్రొఫెషన్సల్‌ కూడా అలా చేయడం కరెక్ట్‌ కాదు అన్నారు.

 

కాగా నాని నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌, థ్రిల్లర్‌ హిట్‌ 3 మూవీ మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అర్జున్‌ సర్కార్‌గా సీరియస్‌ పోలీసుల ఆఫీసర్‌ పాత్రలో నాని కనిపించనున్నాడు. దోషులు, నేరస్తుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ ఫుల్‌ వయోలెన్స్‌ చూపించబోతున్నట్టు టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. ఇటీవల విడుదలైన హిట్‌ 3 ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. రికార్డు వ్యూస్‌లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ చిత్రంలో నాని సరసన కేజీయఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిచింది.