Published On:

Ashu Reddy Brain Surgery: అరగుండు.. ఆస్పత్రి బెడ్‌పై అషురెడ్డి – కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్‌ భామ

Ashu Reddy Brain Surgery: అరగుండు.. ఆస్పత్రి బెడ్‌పై అషురెడ్డి – కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్‌ భామ

Ashu Reddy Undergoes Brain Surgery: అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్‌ మీడియా, బిగ్‌బాస్‌ లవర్స్‌కి ఈమె బాగా సుపరిచితం. ఇన్‌స్టాగ్రామ్‌ తరచూ గ్లామరస్‌, వెకేషన్స్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్స్‌ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆర్జీవీతో బోల్డ్‌ ఇంటర్య్వూలో ఈ భామ బాగా ఫేమస్‌ అయ్యింది. అయితే ఎప్పుడు పాజిటివ్‌గా, నవ్వుతూ ఉండే అషురెడ్డి తాజాగా తన ఫ్యాన్స్‌ని కన్నీరుపెట్టించింది. ఎప్పుడు గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేసే ఆమె ఓ షాకింగ్‌ వీడియోని పోస్ట్‌ చేసింది. ఇది అంతా అషుకు ఏమైందని ఆందొళన వ్యక్తం చేస్తున్నారు.

 

కాగా ఇటీవల ఓ టాక్‌ షో పాల్గొన్న అషురెడ్డి తనకు బ్రెయిన్‌ సర్జరీ అయ్యిందని చెప్పిన సంగతి తెలిసిందే. దానివల్ల తాను ఎన్నో ప్రాజెక్ట్స్‌ని వదులుకున్నానని, దీనివల్ల ఓ డ్యాన్స్‌ షో నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అంతేకాదు ఈ సర్జరీ వల్ల కొంతకాలం అరగుండుతో ఉండాల్సి వచ్చిందని కూడా చెప్పింది. గతేడాది జరిగిన ఈ సర్జరీ గురించి తాజాగా తన అభిమానులతో పంచుకుంది. బ్రెయిన్‌లో ట్యూమర్‌ వచ్చిందని, అది సర్జరీ చేసి తొలగించినట్టు చెప్పింది. ఇందులో ఆస్పత్రిలో సర్జరీ నుంచి కోలుకుంటున్న వరకు పలు ఫోటోలు వీడియో రూపంలో షేర్‌ చేసింది. మాయ ఓ మాయ ఈ లైఫ్‌ అంటే మాయ అనే పాటను జత చేసింది.

 

ఇక దీనిని షేర్‌ చేస్తూ.. “జీవితమంటే ఇదే. అందరి పట్ల ప్రేమ, దయతో ఉండండి. దానివల్ల చాలామంది బాగుపడతారు” అని క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా ఇందులో ఆమె తనకు జరిగిన దాని గురించి క్రంగిపోతూ కన్నీరు పెట్టుకుంటుంది. సర్జరీ తర్వాత కుట్లు విప్పుతుండగా.. నొప్పిని పంటికింది అణుచిపట్టుకుంది. అరగుండుతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో కన్నీరు పెట్టుకున్న ఆషురెడ్డి వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. నువ్వు ధైర్యవంతురాలు.. ఎంతో కష్టాన్ని దాటేశావు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అషురెడ్డి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)