Last Updated:

Rashmi Gautham: నన్ను క్షమించు.. జీవితాంతం నిన్ను మిస్ అవుతాను.. రష్మీ ఎమోషనల్ పోస్ట్

Rashmi Gautham: నన్ను క్షమించు.. జీవితాంతం నిన్ను మిస్ అవుతాను.. రష్మీ ఎమోషనల్ పోస్ట్

Rashmi Gautham: యాంకర్ రష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా రష్మీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ షో కన్నా ముందు పలు సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. ఆ తరువాత గుంటూర్ టాకీస్ ద్వారా హీరోయిన్ గా మారి.. మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడప్పుడు సినిమాలతో పలకరిస్తుండే రష్మీ… జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడుపుతూ మరింత గుర్తింపు తెచ్చుకుంది.

 

అయితే సుడిగాలి సుధీర్ – రష్మీ మధ్య ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పుకొస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలనుకుంటున్నామని కోరుకుంటున్నారు. ప్రస్తుతం వరుస షోస్, సినిమాలతో బిజీగా ఉన్న రష్మీ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.

 

సినిమాల విషయం పక్కన పెడితే రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా డాగ్స్ కోసం ఆమె ఏమైనా చేస్తుంది. కరోనా సమయంలో రోడ్డుమీద తిరిగే  డాగ్స్ కు భోజనం పెడుతూ ఎంతో హెల్ప్ చేసింది. అంతేగాకుండా ఎవరైనా జంతువులను హింసిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వారిపై మండిపడుతూ ఉంటుంది. ఈ మధ్యనే రష్మీ తన పెట్ డాగ్ చుట్కీ గౌతమ్ ను కోల్పోయిన విషయం తెల్సిందే. 

 

తాజాగా చుట్కీ గౌతమ్ అస్థికలను రష్మీ గోదావరిలో కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంటూ.. మరోసారి చుట్కీని  తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. ” నిన్ను ప్రేమించే అవకాశం కోసం..  జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను.  పునర్జన్మ నిజమైతే, నువ్వు బాధ లేకుండా పుడతావని ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. కొన్ని కఠినమైన ఎంపికలు చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించు. ప్రశాంతంగ వెళ్లు చుట్కీ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

ఇవి కూడా చదవండి: