Home / క్రైమ్
రూ.200 కోట్ల కుంభకోణంలో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాసాడు.
ఇంటర్మీడియట్ చదువుతున్న తన సహచర విద్యార్థినిపై ఓ యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో బెదిరించి మరీ తనపై అఘాత్యాయికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం అనంతపురం నగరంలో వెలుగు చూసింది.
నైరోబి నుండి భారత్ లోకి మాదకద్రవ్యాలు తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతని నుండి 35కోట్లు విలువచేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో చోటుచేసుకొనింది.
తెలంగాణలోని గ్రానైట్ కంపెనీ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై జరిపిన సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని ఈడీ అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయన్నారు.
ఓ ప్రధానోపాధ్యాయుడి మూర్ఖత్వానికి 200 మంది విద్యార్ధులు ఆసుపత్రి పాలైన ఘటన బీహార్ లో చోటుచేసుకొనింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు.
తెలంగాణలో సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్ మరియు జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు.