Home / క్రైమ్
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో మరో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసి, ఆమె తల నరికి, శరీరాన్ని 6 భాగాలుగా నరికిన మాజీ ప్రేమికుడు అరెస్ట్ అయ్యాడు.
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదాచారులపైకి ట్రక్కు దూసుకురావటంతో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
దిల్లీలో శ్రద్దా వాకర్ ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్దాను చంపి 35 ముక్కలు చేసిన ఎపిసోడ్ మరచిపోక ముందే బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించి మరో లేఖ విడుదల చేసాడు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
కేరళలోని కొచ్చిలో కామాంధులు రెచ్చిపోయారు. రన్నింగ్ కారులో 19 ఏళ్ల మోడల్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. వేడుకలకు హాజరయ్యి 21 మంది సజీవదహనం అయ్యారు. అందులో 17 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఆవేదనకరం. ఈ దుర్ఘటన పాలస్తీన గాజాలోని శరణార్థుల శిబిరంలో చోటుచేసుకుంది.
ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న మహిళ శ్రద్ధా వాకర్ ను దారుణంగా హతమార్చిన హంతకుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీసుల విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో శ్రద్ధను చంపినట్లు అంగీకరించాడు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు.