Revolt RV BlazeX: అదిరే ఎలక్ట్రిక్ బైక్.. మైలేజ్ 150కిమీ.. ధర చూస్తే ఆశ్చర్యపోతారు..!

Revolt RV BlazeX: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీల్లో రివోల్ట్ మోటార్స్ కూడా ఒకటి. రివోల్ట్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ, ఉనికిని రోజురోజుకి మరింత విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా తన పోర్ట్‌ఫోలియోకు కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘RV BlazeX’ని జోడించింది. ఇది స్మార్ట్ , అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం. దీనిని ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.114,990గా నిర్ణయించారు. ఈ మోటార్‌సైకిల్‌పై 3 సంవత్సరాలు లేదా 45,000కిమీల వారంటీ కూడా ఇస్తున్నారు. బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌లో నేటి నుండి బుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీ మార్చి 2025 మొదటి వారంలో ప్రారంభమవుతుంది.
ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్‌లో 4కిలోవాట్ పీక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 85Kmph వేగంతో, 150Km వరకు రేంజ్ అందిస్తుంది. ఇందులో రిమూవ్ చేయగల 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది, ఇది IP67-సర్టిఫైడ్ కూడా. ఈ బ్యాటరీ డ్యూయల్ ఛార్జింగ్ ఫీచర్స్‌కు సపోర్ట్ ఇస్తుందది. ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌తో బ్యాటరీని కేవలం 80 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ చేయచ్చు. అయితే స్టాండర్డ్ హోమ్ ఛార్జర్‌తో 3 గంటల 30 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ చేయచ్చు.
భద్రత, రైడర్ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి మోటార్‌సైకిల్‌లో LED హెడ్‌లైట్లు, LED టైల్‌లైట్లు, CBS బ్రేకింగ్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇది కాకుండా రివర్స్ మోడ్‌తో పాటు మూడు రైడింగ్ మోడ్‌లను కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. వీటిలో స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ ఉన్నాయి. ఈ రెండు రంగులు బోల్డ్,ఆధునిక డిజైన్‌ను అందిస్తాయి.
ఆర్‌వీ జియో-ఫెన్సింగ్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, 4జీ టెలిమాటిక్స్‌తో సహా మొబైల్ కనెక్టివిటీ స్మార్ట్ ఫీచర్‌లు బ్లేజ్‌ఎక్స్‌లో ఉన్నాయి. బిల్ట్ ఇన్ జీపీఎస్‌తో కూడిన 6-అంగుళాల LCD డిజిటల్ క్లస్టర్ రియల్ టైమ్ నావిగేషన్, రైడ్ డేటా, రిమోట్ మానిటరింగ్ ఆప్షన్స్ అందిస్తుంది. ఇది నాచురల్, సాంకేతికతతో నడిచే అనుభవాన్ని అందిస్తుంది. ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, అండర్ సీట్ ఛార్జర్ కంపార్ట్‌మెంట్ వంటి ఎలిమెంట్స్ రైడర్ సౌలభ్యాన్ని పెంచుతాయి. భారతీయ మార్కెట్లో ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్.. ఓలా రోడ్‌స్టర్, అల్ట్రావైలెట్, ఫెర్రాటో, ఒబెన్ రోర్, కోమాకి రేంజర్ వంటి అనేక మోడళ్లతో నేరుగా పోటీపడనుంది.