Published On:

Maruti Suzuki Eeco Sales Down: సేల్స్ డౌన్.. తగ్గిన మారుతి సుజికి ఈకో అమ్మకాలు.. అసలు కారణం ఇదేనా..!

Maruti Suzuki Eeco Sales Down: సేల్స్ డౌన్.. తగ్గిన మారుతి సుజికి ఈకో అమ్మకాలు.. అసలు కారణం ఇదేనా..!

Maruti Suzuki Eeco Sales Down: భారతదేశంలో చౌకైన 7 సీట్ల కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ బడ్జెట్ లేని వారికి ఈ సెగ్మెంట్ చాలా పొదుపుగా ఉంటుంది. చాలా ఎక్కువ కాదు కానీ కొన్ని 7 సీట్ల ఎంపికలు రూ. 8 లక్షల కంటే తక్కువకు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి ఈకో అనేది చాలా సరసమైన తక్కువ బడ్జెట్ 5/7 సీటర్ కారు. కానీ ఈసారి ఈకో అమ్మకాలు చాలా నిరాశపరిచాయి. గత నెల విక్రయాల నివేదికలో కాస్త వెనుకబడింది. ఇప్పుడు దీని వెనుక కారణం ఏమిటి? తదితర వివరాలు తెలుసుకుందాం.

 

మారుతి సుజుకి ఈకో గత నెలలో 10,409 యూనిట్లను విక్రయించగా, 2024 సంవత్సరం ఇదే నెలలో ఈ సంఖ్య 12,019 యూనిట్లుగా ఉంది. FY 2024-25లో కంపెనీ 135,672 యూనిట్లను విక్రయించింది. అయితే FY 2023-24లో మొత్తం 137,139 ఈకో యూనిట్లు అమ్ముడయ్యాయి. అధిక ధర కారణంగా, ఈ వాహనం అమ్మకాలు క్షీణించాయి. ఈకో ధర రూ. 5.44 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కానీ నిరంతరం పెరుగుతున్న ధర కారణంగా, ఈ వాహనాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతోంది.

 

ఈకో ఇప్పటికీ మీరు కొనుగోలు చేయగల అత్యంత సరసమైన 7 సీట్ల కారు. ఈ వాహనం 5, 7 సీట్లలో లభిస్తుంది. పవర్ కోసం 1.2L లీటర్ పెట్రోల్ ఇంజన్‌ అందించారు. ఈ ఇంజన్ 81 పిఎస్ పవర్, 104 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలానే సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది.

 

పెట్రోల్ మోడ్‌లో ఈ కారు 20 kmpl మైలేజీని అందిస్తుంది, అయితే CNG మోడ్‌లో ఇది 27 km/kg మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం మారుతి ఈకోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, చైల్డ్ లాక్, స్లైడింగ్ డోర్లు, డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈకో ఒక ప్రాథమిక 7 సీట్ల కారు , రోజువారీ ఉపయోగం కోసం ఇది ఉత్తమ ఎంపికగా నిరూపిస్తుంది.