Mahindra XEV 7e: మాహిశ్మతి ఊపిరి పీల్చుకో.. మహీంద్రా XEV 7e వచ్చేస్తోంది.. బ్యాటరీ బాహుబలి రేంజ్‌లో ఉంది..!
Mahindra XEV 7e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు BE 6, XEV 9eలను గత సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలు వాటి రేంజ్, డిజైన్‌తో ప్రజలను ఆకర్షించాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ SUV ‘XEV 7e’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ కొత్త మోడల్ ఫోటో లీక్ అయింది. ఈ మోడల్ XUV.e8 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. దీని డిజైన్ XUV.e8 కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. అయితే ప్రొడక్షన్ మోడల్‌లో కూడా కొన్ని మార్పులు చేయనున్నారు. ఇది మాత్రమే కాదు, దీన్ని ఆటో ఎక్స్‌పో 2025లో కూడా ప్రదర్శించనుంది. అయితే ఇప్పటి వరకు ఈ కొత్త మోడల్‌కు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
డిజైన్ గురించి మాట్లాడితే XEV 7e మహీంద్రా ఇల్యూమినేటెడ్ లోగో, కొత్త క్లోజ్డ్ గ్రిల్‌ను కూడా పొందుతుంది. BE 6,XEV 9e లాగా, సిగ్నేచర్ LED DRL లైట్లను ఇందులో చూడచ్చు. ఈ కారులో ప్రత్యేకమైన స్టార్-ప్యాటర్న్ ఏరో వీల్స్, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ ఉంటుంది.
ఇది కాకుండా, దీని సైడ్ ప్రొఫైల్, వీల్స్, బూట్ డిజైన్, టెయిల్ ల్యాంప్, పిల్లర్ స్ట్రక్చర్ కంపెనీ XUV700ని పోలి ఉంటాయి. కొత్త మోడల్ INGLO ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇది చాలా సురక్షితమైన, అధిక పనితీరు గల ప్లాట్‌ఫామ్. దీనిని కంపెనీ రాబోయే కార్లలో ఉపయోగిస్తుంది.
దీని బ్యాటరీలో BYD లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) ఫీచర్లను ఉపయోగించారు. ఇది 59kWh బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుందని అంచనా. సింగిల్ ఛార్జింగ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఇది 6 సీట్ల వేరియంట్లో రావచ్చు. ఇది కాకుండా, ఫ్రంట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ట్రిపుల్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్, 16-స్పీకర్ ఆడియో సిస్టమ్, 2-స్పీకర్ స్టీరింగ్ వీల్, కెప్టెన్ సీట్లు, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కొత్త XEV 7e ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.