Last Updated:

Kia Syros: కియా సిరోస్ ఎస్‌యూవీ.. సైరా అంటూ వచ్చేస్తోంది.. ధర చాలా తక్కువ..!

Kia Syros: కియా సిరోస్ ఎస్‌యూవీ.. సైరా అంటూ వచ్చేస్తోంది.. ధర చాలా తక్కువ..!

Kia Syros: దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ కియా ఫేమస్ కంపెనీగా ఇండియన్  మార్కెట్లో పేరు తెచ్చుకుంది. దేశంలో సంస్థ సెల్టోస్, సోనెట్, కేరన్స్‌తో సహా వివిధ కార్లను విక్రయిస్తుంది. కస్టమర్లు కూడా పెద్ద సంఖ్యలో వీటిని కొనుగోలు చేసేందుకు సముఖంగా ఉన్నారు. నవంబర్ నెలలో కంపెనీ 20,600 యూనిట్ల కార్లను విక్రయించింది. 2023లో ఇదే నెలలో 39,981 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి 9.5 శాతం క్షీణించాయి. అయితే ఈ డిసెంబర్‌లో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

కియా డిసెంబరు 19న సరికొత్త సైరస్ SUVని విడుదల చేయడానికి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు ఈ కారుపై వినియోగదారులకు క్యూరియాసిటీ పెంచేలా సోషల్ మీడియాలో మరో టీజర్ విడుదలైంది. అయితే కొత్త SUV గురించి ఎటువంటి రహస్యాన్ని వదిలిపెట్టలేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కొత్త కియా సిరోస్ SUV అధునాతన ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కారులో వినూత్న LED హెడ్‌లైట్లు, LED DRLలు, LED టెయిల్‌ల్యాంప్‌లు, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్ లభిస్తాయని తెలిపింది.

ఈ కియా సైరస్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందే అవకాశం ఉంది. కొత్త SUV 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 118 పిఎస్ హార్స్ పవర్, 172 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌ని పొందుతుందని కూడా కంపెనీ తెలిపింది.  మరో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది 113 పిఎస్ హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేయగలదు. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది.

కొత్త కియా సైరస్ SUV అనేక వినూత్న ఫీచర్లను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. సేఫ్టీ పరంగా కారులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ప్రయాణీకుల రక్షణ కోసం సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్‌తో సహా వివిధ భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

కొత్త కియా సైరస్ ఎస్‌యూవీ 5 లేదా 7 సీట్ల ఎంపికతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలానే దీన్ని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారు ధర కనిష్టంగా రూ.6 లక్షలు, గరిష్ఠంగా రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.