Home /Author Guruvendhar Reddy
Google Signs Agreement With AP Government Minister Nara Lokesh: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య అమరావతిలోని సచివాలయంలో నేడు అవగాహన ఒప్పందం కుదిరింది. […]
Devendra Fadnavis Takeen Oath as Maharashtra CM: మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే వేదిక మీద శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. […]
Rohit Sharma Confirms KL Rahul Will Open in the 2nd Test match: ఆసీస్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. నేడు రెండో టెస్ట్‌కు సిద్దమైంది. అడిలైడ్‌లో జరిగే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గురువారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక వివరాలను వెల్లడించారు. మిడిలార్డర్లో తాను బ్యాటింగ్‌కు వస్తానని, యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని […]
Burra Venkatesham took charge as the Chairman of TGPSC: రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు పారదర్శంగా, వేగంగా చేపడుతామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గురువారం నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో బుర్రా చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది బుర్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఐఏఎస్ […]
Sharmila Complaints against jagan to ACB: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అదానీ విద్యుత్ ఒప్పందంలో భాగంగా జరిగిన అవినీతి మీద విచారణ చేసి, నిందితులెవరో బయటపెట్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయట పడిందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన రూ.1750 […]
Baroda make history, smash the highest ever total in T20 cricket: టీ20 పొట్టి క్రికెట్లో మరో సంచలనం జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. ఇండోర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు పరుగుల విధ్వంసం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు చేసింది. దీంతో టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. బరోడా జట్టులో భాను […]
Sara Tendulkar joins Sachin Tendulkar Foundation as director: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సమాజ సేవ దిశగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఇటీవలే సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (ఎస్టీఎఫ్) డైరెక్టర్‌గా నియమితులైన సారా.. తమ ట్రస్ట్ తరపున మారుమూల పల్లెల్లోని పేద పిల్లలకు మెరుగైన వైద్యం అందించే ప్రాజెక్టు కోసం ఇకపై మరింత సమయం కేటాయించనున్నారు. ఈ విషయాన్ని సచిన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘మా అమ్మాయి సారా ఎస్టీఎఫ్ […]
Telangana Assembly Sessions To Start From December 9: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. పలు కీలక చట్టాల ఆమోదానికి సర్కారు సిద్ధం ప్రతీరోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని […]
Harish Rao Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన నివాసం వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే బంజారాహిల్స్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం కొండాపూర్‌లోని […]
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విద్యా శాఖ […]