Home /Author Mallikanti Veerabhadram
Minister ponnam react on brs mlc kavitha issue: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసమే ఆమె ఈ వ్యవహారం నడిపించారని అన్నారు. అందుకే ఆమె తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారని చెప్పారు. కవిత, బీఆర్ఎస్ పంచాయితీ టీకప్పులో తుపాన్ లాంటిదని ఎద్దేవా చేశారు. రాజకీయంగా అందరి దృష్టి మార్చేందుకే కవిత లెటర్ డ్రామా నడిపించారని ఆరోపించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను […]
Telangana: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు. జేసీబీలను అడ్డుకున్నారు. కంపెనీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలిలో పోలీసులను భారీగా మొహరించారు. నిరసనలకు దిగిన రైతులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, […]
Botsa Satyanarayana Falls Down on Stage: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతతో కుప్పకూలారు. రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం పేరుతో పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన చేస్తుండగా అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ మట్లాడుతుండగానే […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన కలుగుతోంది. రోజురోజుకు యాక్టీవ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఇవాళ మరో 276 మందికి కరోనా వైరస్ సోకింగి. దీంతో దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,302 కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 276 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ […]
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఇవాళ తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ ఆటోపై బోల్తా పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఝాబువా జిల్లాలోని మేఘ్ నగర్ తహసీల్ పరిధిలోని సెంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా లారీ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోపై పడింది. ప్రమాదం జరిగిన […]
Prize Money: రెండు నెలలుగా 10 జట్ల మధ్య హోరెత్తించిన ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ట్రోఫీ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆర్సీబీ కల నెరవేరింది. ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ వేడుకల్లో విజేత ఆర్సీబీ, రన్నరప్ పంజాబ్ కింగ్స్ తో పాటు పలువురు ఆటగాళ్లకు అవార్డులు లభించాయి. ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 20 కోట్ల ప్రైజ్ […]
New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో పూర్తిస్థాయి కేబినెట్ భేటీ కానుంది. దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అలాగే ఆపరేషన్ సిందూర్ తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశంలో ఏడాది కాలంగా ప్రభుత్వ పనితీరుపై సమీక్ష చేయనున్నట్టు సమాచారం. అలాగే […]
AP: ఏపీ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. కాగా మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే అజెండా తయారు చేశారు. సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా నేటి సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే జీఏడీ టవర్ టెండర్లకు […]
Telangana: జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు దరాఖాస్తు చేసుకునేందుకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు రానున్నాయని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ వెల్లడించారు. ఈ మేరకు దరఖాస్తులు తీసుకునేందుకు నాంపల్లిలోని ఏక్సైజ్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాగా రూరల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీతో కలుపుకుని 28 బార్ల పునరుద్ధరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు […]
Piligrims: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ఓ వైపు వేసవి ముగిసే సమయం దగ్గర పడుతుండడం, రైతులు, ప్రజలు వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుండటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నందున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కాగా నెలరోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి […]