Special Trains: ప్రయాణికుల కోసం మరిన్ని స్పెషల్ ట్రైన్స్

South Central Railway Announce Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా పలు రూట్లలో స్పెషల్ రైళ్లను ప్రవేశపెడుతోంది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని మార్గాలకు విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్- నాగర్ సోల్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. జూలై 3 నుంచి జూలై 25 వరకు ఈ అందుబాటులో ఉంటాయని ప్రకటన విడుదల చేసింది.
రైలు నెం. 07001 సికింద్రాబాద్- నాగర్ సోల్ మధ్య జూలై 3 నుంచి ప్రతి గురువారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి రాత్రి 9.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటుంది. తిరిగి రైలు నెంబర్. 07002 నాగర్ సోల్- సికింద్రాబాద్ మధ్య ప్రతి శుక్రవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. నాగర్ సోల్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజ్ గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బని, జల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. ఈరైలుకు ఫస్ట్, సెకండ్, థర్ఢ్ ఏసీ కోచ్ లు ఉంటాయి.