Home /Author Mallikanti Veerabhadram
Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటంతో జోరుగా వానలు పడుతున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, […]
Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అడిగినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు విడుదల చేసిందన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ […]
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు గుంతలో పడి ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని హర్దోయ్ లో ఎర్టిగా కారు అదుపుతప్పి గుంతలో పడటంతో ప్రమాదం జరిగింది. బాధితులు కుసుమ గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి పాటియానిమ్ గ్రామానికి తిరిగి వస్తుండగా దుర్ఘటన జరిగింది. కాగా ఆలంనగర్ రోడ్డులో ఓ మూల మలుపు వద్ద కారు అదుపుతప్పి అతివేగంగా వెళ్లి బోల్తా […]
Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న దోషులను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. కాగా తాజాగా థానేకు చెందిన రవీంద్ర వర్మ అనే మెకానికల్ ఇంజనీర్ ను సైతం పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడని అదుపులోకి తీసుకున్నారు. కాగా రవీంద్రను 2024లో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే ఇద్దరు పాక్ ఏజెంట్లు ఫేస్ బుక్ ద్వారా హనీట్రాప్ చేశారు. భారత ఏజెంట్లుగా […]
Elon Musk: అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. “అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా నా షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్ నకు ధన్యవాదాలు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుంది”. అంటూ రెండు రోజుల క్రితం ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేడి టర్కీకి బాగానే తగులుతోంది. దాయాది పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తోంది. భారత్ నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. తాజాగా టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఇండిగో చేసుకున్న లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లో ముగించాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్ కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల […]
Bhopal: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జంబోరి గ్రౌండ్ లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరై.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సదస్సుకు హాజరయ్యే మహిళలు సింధూర రంగు చీర ధరించాలని విజ్ఞప్తి చేశారు. లోకమాతదేవి అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ. 300 ప్రత్యేక […]
AP: ఏపీ సీఎం చంద్రబాబు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా వారికి పెన్షన్ ఇవ్వనున్నారు. అనంతరం బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో సమావేశం కానున్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుంటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ […]
India: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత ఆర్మీ నేడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. దీంతో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ లోనూ భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. తమ దేశంపై భారత్ ఏదో చేయబోతోందని పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. కాగా ఆపరేషన్ షీల్డ్ పేరుతో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు బ్లాక్ అవుట్ తో […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ పై ముంబై విజయం సాధించింది. నిన్న పంజాబ్ లోని ఛండీగఢ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై 20 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 […]