Home /Author Jyothi Gummadidala
తెలంగాణ రాష్ట్ర వాప్యంగా సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా ఇటు తెరాస, భాజపా అటు కాంగ్రెస్ పార్టీలు ఈ వేడుకలను జరుపుతున్నాయి.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్ చిత్రాల హవా కొనసాగుతుందనే చెప్పాలి. విరివిరిగా సీక్వెల్ సినిమాలు తెరకెక్కుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన ‘సీతారామం’ సినిమా విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. కాగా దీనిపై దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం, ఆపై వారి దగ్గరి నుంచి నగదు, నగలతో పరారు కావడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సీన్ కట్ చేస్తే మంత్రి మా బంధువని కొంతమందిని, పోలీసు శాఖలో పలుకుబడి ఉందని మరికొందరి దగ్గర నమ్మపలికింది. 5 మందిని పెళ్లాడి చివరకు కటకటాలపాలయ్యింది.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని, అన్ని పార్టీలు భయపడ్డాయి కానీ ఈ ఏడాది ప్రధాని కృషితో భాగ్యనగరంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సంజూ శాంసన్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. న్యూజిలాండ్-ఏతో ఇండియాలో జరిగే మూడు వన్డేల సిరీసులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
ఓటీటీ ప్లాట్ ఫాంలు... ప్రేక్షకులకు పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలను కాకుండా కొత్త అనుభూతిని అందించేందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. మూవీలను తలదన్నేలా భారీ ఖర్చుతో ఈ వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. కాగా అలా రూపొందించబడిన వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..
అతను ఏ లాటరీ టికెట్టు కొనలేదు.. ఆన్లైన్ ట్రేడింగ్ చెయ్యలేదు కానీ కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకుంటున్నారా... బ్యాకింగ్ సేవల్లో పొరపాటు వల్ల ఓ వ్యక్తి ఒక్కరోజు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది.
దేశంలోనే తయారయ్యే సెమీకండక్టర్లు వల్ల ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా తగ్గుతాయని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో పలుకుతున్న ల్యాప్ ట్యాప్ ధరలు వేలల్లో కొనుగోలు చెయ్యవచ్చన్నారు.