Home /Author Jyothi Gummadidala
భారత తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) రిక్రూట్మెంట్ 2022 ఫలితాలొచ్చేశాయ్. బుధవారం (అక్టోబర్ 18)న జీడీఎస్ కు సంబంధించిన ఫలితాలను పోస్టల్ శాఖ రిక్రూట్ మెంట్ కమిటీ వారు విడుదల చేశారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా వెలుగొందుతున్న అజిత్‌కి బైక్‌పై ప్రయాణాలు చేయడం అంటే అమితమైన ఇష్టం. కాగా 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్ జర్నీకి అజిత్ ప్రణాళిక రూపొందిస్తున్నారట. దీని కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
విశాఖపట్టణంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఓ లాడ్జీలో శ్రీకాకుళానికి చెందిన ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంగా ప్రేమించుకున్న తమ పెళ్లికి ఎక్కడ పెద్దలు అంగీకరించరోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రపంచకప్ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీసుల్లో లీనమయ్యాయి. కాగా తాజాగా టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఏ క్వాలిఫయర్ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాటర్ జునైద్ సిద్ధిఖి భారీ సిక్సర్ బాదాడు. ఏకంగా 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు.
భాగ్యనగరం ఈ పేరు తెలియని వారుండరనడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనగరంగా ఖ్యాతి నొందిన హైదరాబాద్ వివిధ రకాల ఆచార వ్యవహారాలు ఆహారాలు వింతలు విశేషాలకు నెలవని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ ఒక్కటే కాదండోయ్ ఇకపై హలీమ్ కూడా స్పెషలే. హైదరాబాద్ హలీమ్ కు అరుదైన గుర్తింపు లభించింది మరి అదేంటో తెలుసుకుందామా..
అమెరికా అంతర్జాతీయ విమాన సర్వీసులో అందులోనూ బిజినెస్ క్లాస్ ప్రయాణికులను అనుకోని అతిథి బెంబేలెత్తించింది. ఫ్లోరిడాలోని న్యూజెర్సీకి బయలు దేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులకు పాము కనిపించింది. దీనితో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతంగా కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ నరికేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణ హత్యను చూసిన జనం భయభ్రాంతులకు గురయ్యారు.
ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను ఆస్పత్రి నర్సులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ వర్షాల కారణంగా అన్నీ నదులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు బ్యారేజీలకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం, అందవెల్లి వద్ద వంతెన కూలింది.
ఇప్పుడే నోట విన్నా కాంతారా మూవీ హవా కొనసాగుతుంది. కాంతారా చిత్రానికి వచ్చినంత పాజిటివ్ టాక్ ఇటీవల వచ్చిన ఏ చిత్రాలకూ రాలేదు. కాంతారా దెబ్బకు ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు చిన్నబోయాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతం కాంతారా చిత్రం మరో రికార్డును సాధించింది. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.