Last Updated:

Kagaznagar: వరద ఉద్ధృతికి.. కళ్ళ ముందే వంతెన కుప్పకూలింది

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ వర్షాల కారణంగా అన్నీ నదులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు బ్యారేజీలకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం, అందవెల్లి వద్ద వంతెన కూలింది.

Kagaznagar: వరద ఉద్ధృతికి.. కళ్ళ ముందే వంతెన కుప్పకూలింది

Kagaznagar: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ వర్షాల కారణంగా అన్నీ నదులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు బ్యారేజీలకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం, అందవెల్లి వద్ద వంతెన కూలింది.

వరద ఉద్ధృతికి కాగజ్ నగర్ అందెవల్లె వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ముందుగానే ఆ వంతెనపై రాకపోకల నిషేధించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. పెద్ద వాగు వరద ఉద్ధృతికి రెండు నెలలుగా వంతెన కుంగి ఉంది. అయితే గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో బ్రిడ్జి కుప్ప కూలింది. దీనితో సమీపంలోని 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాకపోకలు పూర్తిగా నిలిపివేసి సహాయకచర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో కూలిన బ్రిడ్జ్ వద్దకు చేరుకుని ఇరువైపులా గోడ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు. అందవెల్లి వంతెన కుంగిపోవడానికి అసలు కారణం ఇసుక దొంగలని, వంతెన పిల్లర్స్ వద్దే అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్లే పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి దీనిలో నిజానిజాలెంటో తెలియాలంటే అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

ఇదీ చదవండి: గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కటాఫ్ ఉండదు

ఇవి కూడా చదవండి: