Home /Author Jyothi Gummadidala
పవన్ వ్యాఖ్యలకు అవనిగడ్డ వేదికగా సీఎం జగన్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఏం చేయలేనివాళ్లు బూతులు తిడుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్‌ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి గానూ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అయితే వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 175 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్. దీపావళి సెలవు తేదీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25వ తేదీని దీపావళి సెలవు దినంగా ప్రకటించారు. అయితే తాజాగా ఆ సెలవును అక్టోబర్ 24న అంటే సోమవారానికి మార్చింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సత్య దీక్షలు ఈనెల 21వ తారీకు నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఈ సత్య దీక్ష యొక్క విధివిధానాలు, నిత్య పూజావిధానము, భక్తులకు మరియు దీక్ష దారులకు తెలియజేసేలా రచించిన సత్య దీక్ష వ్రతకల్పం అనే పుస్తకాన్ని రచించారు.
కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారని అడిగినందుకు అక్కడి మహిళ ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన్ని తరిమేసింది. ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అన్ని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇకపై మునుగోడు రంగంలోకి సీఎం కేసీఆర్ దిగనున్నారని సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఫ్యాన్స్ కొదవలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ పై అక్కడి ప్రజలు ఎల్లలుదాటిన అభిమానాన్ని కనపరిచారు. దానితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడంలో, ఇతర భాషల్లోని నటీనటులకు అవకాశాలివ్వడంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్‌ను రాజమౌళి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కాగా ఇప్పుడు ఉక్రెయిన్ భామ మరియా కూడా ప్రిన్స్ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ అందాల ముద్దుగుమ్మ మరియా గురించి తెలుసుకుందామా..
పెళ్లి అనగానే సాధారణంగా కట్నం ఎంత అని అడుగుతుంటారు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి కట్నకానుకలు సమర్పించడం అనాది కాలంగా వస్తోన్న ఆచారం. ఎవరి స్థాయికి తగినట్టుగా వారు వరుడికి వివిధ వస్తువులు, నగదు, బంగారం రూపేణా కట్నాలు సమర్పించుకుంటారు. అయితే ఒక ప్రాంతంలో వింత ఆచారం కొనసాగుతుంది వరుడికి కట్నం కింద వారు పాములు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.