Home /Author Jaya Kumar
నేటి కాలంలో మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భార్యని, కన్న కూతుర్ని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. భార్య, కుమార్తెను పక్కా ప్లాన్ తో హతమార్చి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.
గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం పై రూ. 50 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాగా ఇప్పటికే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని.. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.
Bubble Gum Movie : రాజీవ్ కనకాల – సుమ కుమారుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలో ‘నిర్మల కాన్వెంట్’ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు ‘బబుల్ గమ్’ అనే మూవీతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల […]
తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని దక్షిణ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే వాతావరణం కొనసాగితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? అని కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం
ఆస్ట్రేలియా - టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మరింత స్పీడ్ పెంచాయి. బీజేపీ అగ్రనేతలు అయిన మోదీ, అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.