Home /Author Jaya Kumar
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుండగా.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత గూటి పక్షులే సీఎం జగన్ కి రివర్స్ అయ్యి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జగన్ కి కాంతి మీద ఆకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు గాను క్రాస్ ఓటింగ్ చేసిన వైకప ఎమ్మెల్యే లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా 'రంగమార్తాండ' .. 'మన అమ్మానాన్నల కథ' అనేది ఉపశీర్షిక. అలానే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
సినిమాలతో ప్రేక్షకులను అలరించే హీరోలందరూ.. ఇప్పుడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో బౌండరీలు కొడుతూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారని చెప్పాలి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ లీగ్ లో.. శుక్రవారం నాడు సెమీఫైనల్స్ నిర్వహించారు. మొత్తంగా ఈ లీగ్ లో 8 టీమ్స్ పాల్గొనగా.. 16 మ్యాచ్లు జరిగాయి.
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన విశిష్ట ఘనతను దక్కించుకుంది. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది. ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ఈ జాబితా ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఉపాసన పేరును అధికారికంగా వెల్లడించారు.
Mekapati Chandrashekar Reddy : వైకాపా నుంచి తనను సస్పెండ్ చేయటంతో తలపై భారం తొలగినట్లైందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. అధికారం ఉందన్న అహంకారంతోనే తనను పార్టీ నుంచి తొలగించారని ముఖ్యమంత్రి జగన్పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీలో పరిస్థితి పైకి కనిపిస్తున్నంత సవ్యంగా లేదని, కొద్ది మంది పెత్తనమే నడుస్తోందని ధ్వజమెత్తారు. ‘నేను వేసిన ఓటుతోనే జయమంగళ వెంకటరమణ గెలిచారు. ఈ విషయంపై దేవుడిపై ప్రమాణం చేస్తా.. […]
జగన్ సర్కార్ ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నేడు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయాన్ని విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ ఈరోజు జమ చేయనున్నారు.
కీర్తి సురేశ్ “ ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నానితో కలిసి నటించిన దసరా సినిమా మార్చి 30 న రిలీజ్ కానుంది.
మన ఇంట్లోని కొన్ని వాస్తు దోషాలు మన అనారోగ్యానికి కారణం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ వాస్తు దోషం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మరి ఆ వాస్తు దోషాలేంటో.. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే మార్చి 25వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..