Home /Author anantharao b
మాజీ ఎంపీ ,కాపు ,బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు.వైసీపీ కానీ , తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కానీ తమ ఎన్నికలు మేనిఫెస్టోలలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన 5 శాతం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కలుగచేసే అంశం లేకపోవటం దురదృష్టకరమని అన్నారు .
డిల్లీలోని 80కి పైగా స్కూళ్లు, మరియు నోయిడాలోని కనీసం రెండు స్కూళ్లకు బుధవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, దీంతో ఈ పాఠశాలలనుంచి విద్యార్దులను తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోల జమానా నడుస్తోంది. మనిషిని పోలిన మనిషి తయారు చేయడం .. చెప్పని విషయాలు చెప్పినట్లు సృష్టించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో సినీతారల డీప్ ఫేక్ వీడియోలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు డీప్ ఫేక్ వీడియోలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఊరు పేరు లేని వారికి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు... రాజ్యసభ సీట్లు అప్పగించారు. అయితే కష్ట కాలంలో వెన్నంటి ఉండాల్సిన సమయంలో తన పార్టీ సహచరులే ఇప్పడు ముఖం చాటేస్తున్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా మొదటివరుసలో ఉన్నాడు. పార్టీలోని ప్రతి ఒక్కరు చద్దా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.
అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించాలని భావించిన బీసీసీఐ.. ఈ టోర్నీలో పాల్గొన టీమ్‌కు రోహిత్‌ను సారధిగా నిమమించింది. వైఎస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేసింది.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సిద్ధార్థ్‌నాథ్‌సింగ్ కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని.. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 15వందల అందిస్తామని చెప్పారు. 18 నుంచి 59 వయస్సు మహిళలకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందన్నారు.
విజయవాడ గురునానక్ నగర్ లో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కలకలం రేపింది. వీరిలో డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) విగత జీవుల్లా కనిపించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు అధికారం అనే ఆకలితో అలమటిస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 1978లో. చంద్రబాబు ఇంటి పెంకులు కూడా వేయించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. ఈ సంపాదన ఎలా సాధ్యపడింది..?మాకు కూడా చెప్తే రాజకీయాలు వదిలేసి మేము కూడా సంపాదించుకుంటామని ముద్రగడ అన్నారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం బాబా రాందేవ్‌కు చెందిన కంపెనీ పతంజలి ఆయుర్వే లిమిటెడ్, దివ్య ఫార్మసీపై కొరఢా ఝళిపించింది. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాందేవ్‌తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ ప్రొడక్టులతో అన్నీ రోగాలు మాయం అవుతాయని తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది.