Home /Author anantharao b
విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ ప్రయాణికుల నౌక విశాఖ చేరుకుంది. ఏప్రిల్ 28 న 80మంది ప్రయాణికులతో 'ది వరల్డ్' అనే క్రూయిజ్ షిప్ పోర్టు లోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కు చేరుకుంది .' ఈ నౌక లగ్జరీ విభాగానికి చెందినది.
తెలుగుదేశం యువనేత జనరల్ సెక్రటరీ నారా లోకేష్ మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం నుంచి విశాఖ వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేష్ ... ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలలో పర్యటించనున్నారు . ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు.
ఏపీలో ఎన్నికల నేపధ్యంలో అనేక విషయాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ ప్రతివిమర్శలు పొడచూపుతున్నాయి .తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 న ఈ చట్టం పై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అమిత్‌రెడ్డి కలిశారు.
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్‌తో 14 మంది పాకిస్తానీ పౌరులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మరియు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో ప్రయాణీకులతో ఉన్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పాతర్రా గ్రామానికి చెందిన బాధితులు తిరయ్య గ్రామంలో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ఎంఐఎంకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో బీజేపీ కె మాధవీలతను బరిలో నిలిపింది. హైదరాబాద్‌లోని అతి పెద్ద ఆస్పత్రి విరంచికి ఆమె డైరెక్టర్.. తన ఎన్నికల అఫిడవిట్లో ఆమె ఆస్తి రూ.221 కోట్లుగా ప్రకటించారు. కాగా ఆమె పాత బస్తీలోని పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారికి ఉచితంగా వైద్య సేవలందించారు
దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే.. 2025 లో రిజర్వేషన్లను రద్దు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని అన్నారు .
మన దేశంలో ఎన్నికలంటే పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే చిన్న గ్రామాల నుంచి అతి పెద్ద నగరాల వరకు ఎన్నికల సందడి మొదలవుతుంది. రాజకీయ పార్టీల కార్యకర్తల హడావుడికి అంతే ఉండదు. బ్యానర్లతో , లౌడ్ స్పీకర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో రెండో దశ పోలింగ్ ముగిసింది. శుక్రవారం నాడు కర్ణాటకలో పోలింగ్ జరిగింది.