Home /Author anantharao b
డ్రగ్స్ మరియు స్మగ్లింగ్ మరియు సరఫరాతో సంబంధం ఉన్న వ్యక్తుల పై భారీ దాడిలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) భారతదేశంలోని అనేక ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. యాంటీ డ్రగ్స్ ఆపరేషన్‌కు సంబంధించి సుమారు 175 మందిని అరెస్టు చేసింది.
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని మంత్రులు హరీష్ రావు, దయాకరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం. స్వీకరించడని కేంద్రం కోరడం జరిగిందని వారు తెలిపారు
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ అభ్యర్థులకు 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 అదనపు ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పధకం కేంద్రం యొక్క జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపికైంది. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం ఈ పధకం లక్ష్యం.
ఇంతవరకూ అప్పులు చేయడంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డుల దిశగా సాగుతోందని భావిస్తున్నారు. అయితే తాజాగా మరో విషయంలో కూడా ఏపీ రికార్డు సృష్టించింది. అదేమిటంటే గత ఏడాది దేశ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో అత్యధిక శాతం ఏపీదే కావడం విశేషం.
బీహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఒక విద్యార్దిని ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరగా రేపు కండోమ్స్ కూడా అడుగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తమ వెబ్ సిరీస్ ‘XXX’ సీజన్ 2లో భారతీయ ఆర్మీ సైనికులను అవమానించి, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసినందుకు సినీ మరియు టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్లకు బీహార్‌లోని బెగుసరాయ్‌లోని స్థానిక కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటివరకూ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని, ఇందులోనూ అధిష్టానం ఆశీస్సులున్న గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమేనని అంతా భావించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది.