Home /Author anantharao b
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
భారతవాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం సంభవించిన భూకంపంలో కనీసం 44 మంది మరణించారు . 300 మందికి పైగా గాయపడ్డారు.
ప్రస్తుతం కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార భగ్నప్రేమికుడని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు.
రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆనేగౌని రమేష్ గౌడ్ దర్శకత్వంలో మంజుల చవన్ నిర్మించిన చిత్రం ‘మన్నించవా’.
కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీనితో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో మరో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసి, ఆమె తల నరికి, శరీరాన్ని 6 భాగాలుగా నరికిన మాజీ ప్రేమికుడు అరెస్ట్ అయ్యాడు.
కమ్మ వర్గానికి ఎపీ ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఓడిపోయినప్పటికి ఆప్కాబ్ ఛైర్మన్ ఇచ్చారని, అదే విధంగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు.
సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేయడం పై విమర్శలు వచ్చాయి.