Home /Author anantharao b
31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన సీరియల్ రేపిస్ట్‌ను ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. 'బీస్ట్ ఆఫ్ బోండి' అని కూడా పిలువబడే కీత్ సిమ్స్‌ను డీఎన్ఏ టెక్నాలజీ సహాయంతో గుర్తించారు.
పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎంపిక చేశారు. నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్న జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మునీర్ నియమితులయ్యారు.
ఢిల్లీలోని జామా మసీదు మసీదు ప్రాంగణంలోకి పురుషులు లేకుండా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మసీదులోకి ఒంటరిగా లేదా గుంపులుగా మహిళలు ప్రవేశించడాన్ని నిషేధిస్తూ జామా మసీదు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ మమ్మల్నే కాదు కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇప్పటం కూల్చివేతల కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించారని పిటిషనర్లకు జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున 14 మందికి జరిమానా విధించింది.
బాలీవుడ్ నటి రిచా చద్దా 2020 గాల్వాన్ ఘర్షణపై చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలపై రిచా ట్వీట్లో 'గాల్వాన్ సేస్ హాయ్' అని రాశారు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్‌ను ఎన్నికల కమిషనర్‌గా ‘సూపర్ ఫాస్ట్’గా నియమించడం ఏమిటని సుప్రీంకోర్టు ఈరోజు ప్రశ్నించగా, ప్రభుత్వ న్యాయవాది నోరు అదుపులో పెట్టుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి చెప్పారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్మాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.