Home /Author anantharao b
కాన్పూర్‌లో ఒక మహిళ తన స్నేహితురాలితో సెక్స్ లో పాల్గొనడానికి నిరాకరించడంతో బాయ్ ప్రెండ్ ప్రైవేట్ భాగాలను నరికివేసింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కాన్పూర్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సంజయ్ పాండే తెలిపారు.ఈ సంఘటన చౌబేపూర్ పోలీస్ సర్కిల్లోని ఒక గ్రామంలో జరిగింది.
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వహీదా 1972లో పద్మశ్రీ, 2011 లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
మణిపూర్ లో జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు ఒక ప్రదేశంలో కూర్చున్నట్లు చూపించారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడుకు కావేరీ నదీజలాల విడుదలకు నిరసనగా మంగళవారం కన్నడ రైతు సంఘాలు మరియు కన్నడ సంస్థలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు బీజేపీ మరియు జెడి(ఎస్) మద్దతు ప్రకటించాయి.
నైజీరియాలో దుండగులు ఆదివారం చేసిన దాడుల్లో 14మందిని చంపి 60 మందిని అపహరించారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుండి పలువురిని కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.
కేరళలోని కొట్టాయంలో ఒక అనుమానాస్పద మాదకద్రవ్యాల వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పోలీసులపై ఒక్కసారిగా పలు కుక్కలు దాడి చేసాయి. ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చారని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. కుక్కల దాడులనుంచి కాపాడుకోవడంపై పోలీసులు దృష్టి సారించడంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు కలిగింది.
అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తో తమ బంధం ముగిసినట్లేనని ప్రకటించింది. సోమవారం తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ వాట్సాప్ చానల్ వారంలోపే 5 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసారు. తన ఫాలోవర్లందరికీ కృతజ్జతలు తెలిపారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలు కుంటల్లో నిమజ్జనం చేయాలని తెలిపింది. హైకోర్టు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఇద్దరిని తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తమిళిసై అంగీకరించలేదు.