Home /Author anantharao b
వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలతోనే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 80 డీజిల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టిఆర్ మార్క్ వద్ద ఈ బస్సులని రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులున్నాయి.
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనుకూల వర్గం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది.
Francoise Bettencourt Meyers: ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ఇటీవల 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఆమె రికార్డు సొంత చేసుకున్నారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించారు. 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా ..(Francoise Bettencourt Meyers) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె తాత స్థాపించిన ”ఎల్’ఓరియల్” షేర్స్ భారీగా పెరగడంతో ఆమె సంపద […]
ఉక్రెయిన్ పై రష్యా 122 క్షిపణులు మరియు 36 డ్రోన్ల తో భారీ ఎత్తున వైమానిక దాడులకు దిగింది. 22 నెలల యుద్ధంలో శుక్రవారం జరిగినది అతిపెద్ద వైమానిక దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడుల్లో సుమారు కనీసం 20 మంది పౌరులు మరణించారు. ఉక్రెయిన్ వైమానిక దళం 87 క్షిపణులు, 27 డ్రోన్లను అడ్డగించిందని ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ వాలెరి జలుజ్నీ చెప్పారు.
ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడి కొండల వెంకటేశ్వరరావు శుక్రవారం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ రాఘవేంద్ర రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు ఆయనను ఘనంగా సత్కరించారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్' అని పేరు మార్చనున్నట్లు సంబంధిత వర్గాలుతెలిపాయి. రామాయణ రచయితగా ఖ్యాతికెక్కిన వాల్మీకి పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని భావించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు సందర్శించారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు వెళ్లారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. క్రిమినల్ కోడ్లు మరియు చట్టాలను సరిదిద్దే మూడు చట్టాలతో సహా కొన్ని మైలురాయి బిల్లులను పార్లమెంటులో ఆమోదించిన తరువాత వారి సంఖ్య బాగా పెరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.