Home /Author anantharao b
విజయవాడ ఎంపి కేశినేని విషయంలో టిడిపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేశినేని నానికి పోటీగా ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని టిడిపి అధిష్టానం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మొన్న తిరువూరు నియోజకవర్గ సమావేశంలో కేశినేని బ్రదర్స్ వర్గీయుల మధ్య రేగిన గొడవ పరస్పర దాడుల వరకూ దారి తీసింది. దీంతో అధిష్టానం ఇక లాభం లేదనుకుంది. వివాదానికి తెరదించాలనుకుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీని.. మెరుగైన సంక్షేమ పథకాలతోనే కొట్టాలని ఆయన లేఖలో సూచించారు. ప్రజలను మభ్యపెట్టి వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని, అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే కూటమి మేనిఫెస్టోలో మెరుగైన పథకాలు ప్రవేశ పెట్టాలని తెలిపారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హనుమాన్.ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతోంది. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం కూడా రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 76 సింగిల్ స్క్రీన్లలో 70 గుంటూరు కారం కోసం కేటాయించారు.
కేజీఎఫ్ స్టార్ యశ్ ఏడాదిన్నర తరువాత తన తదుపరి చిత్రానికి సిద్దమయ్యాడు. టాక్సిక్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్‌ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
జపాన్‌లో న్యూ ఇయర్ రోజున దేశం యొక్క పశ్చిమ తీరాన్ని తాకిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య గురువారం 73కి పెరిగింది. కూలిపోయిన భవనాల క్రింద ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. సుమారుగా పదివేల మంది సహాయం కోసం వేచి ఉన్నారు.
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్ చిత్రాలను పంచుకున్నారు . లక్షద్వీప్ సహజమైన బీచ్‌ల వెంట ఉదయాన్నే నడకలు స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగించే క్షణాలు అని అన్నారు. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె ప్రతిపాదనని విరమించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2773 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. పెరిగిన ప్రయాణీకులతో డీజిల్ ఖర్చు ఎక్కువైందని అద్దె బస్సు ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు జితేంద్ర అవద్ బుధవారం రాముడు 'మాంసాహార' అంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగింది.అతని ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడి వైరల్ గా మారింది.మరోవైపు బీజేపీ అవద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. అతనిపై ఫిర్యాదు చేసింది.
వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.