Jeffrey Epstein: జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం: తెరపైకి బిల్ క్లింటన్,డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖుల పేర్లు
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు.
Jeffrey Epstein: అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రముఖులు, సంపన్నుల పేర్లు బయటకు వచ్చాయి.
అమ్మాయిలను ఎరవేసి..(Jeffrey Epstein)
జెఫ్రీ ఎప్‌స్టీన్ సెలెబ్రిటిలతో పాటు పాటు రాజకీయ నాయకులు, బిలియనీర్లు, విద్యావేత్తలతో పరిచయాలు ఏర్పరచుకొని వారికి అమ్మాయిలను ఎరవేసేవాడు . 2005లో ఆయన చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆయనపై నమోదైన చార్జీల విషయానికి వస్తే 14 ఏళ్ల మైనర్ బాలికతో సెక్సువల్ సర్వీసులు చేయించుకున్నాడనేది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ. అటు తర్వాత ఆయన పై ఇలాంటి ఆరోపణలు చేశారు పలువురు మైనర్ బాలికలు. తమను కూడా బలవంతంగా సెక్స్‌వల్ సర్వీసుకు వాడుకున్నారని ఆరోపించారు. అటు తర్వాత 2008లో ఎపిస్టీన్ తను చేసిన నేరానికి ఒప్పుకున్నాడు. అటు తర్వాత ఆయన 13 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.
అత్యాచార ఆరోపణలు..
జెఫ్రీ ఎఫిస్టిన్‌కు శిక్షపడ్డ వెంటనే మాజీ అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లాంటి వారు ఎఫిస్టన్‌కు క్రమంగా దూరం అయ్యారు. అయితే మరి కొంత మంది మాత్రం ఆయనతో సన్నిహిత సంబంధాలు యధావిధిగా కొనసాగించారు. జెఫ్రీపై పెద్ద ఎత్తున వివాదాలు ముదురుతున్నా ఆయన మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు. మరో దశాబ్దం కాలం పాటు దేశంలోని సంపన్నులకు మైనర్ బాలికలను సరఫరా చేసే వాడు. అప్పడప్పుడు దాతృత్వ కార్యక్రమాలు చేపట్టేవాడు.ఇక జెఫ్రీ నేరాల్లో ఘిస్లైన్ మాక్స్వెల్ కు కూడా భాగస్వామ్యం ఉంది. కాగా మాక్స్‌వెల్‌కు వ్యతిరేకంగా 2015లో వర్జినా గుయుఫ్రే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.గుయుఫ్రేతో పాటు పలు మహిళలు ఎపిస్టిన్‌పై ఆరోపణలు గుప్పించారు. తమను ఫ్లోరిడా, న్యూయార్కు, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, న్యూమెక్సికోల్లో ఎఫిస్టిన్ భవంతుల్లో అత్యాచారాలు చేశారని ఈ మహిళలంతా కేసు ఫైల్ చేశారు. తనపై అత్యాచారం జరిగినప్పుడు తన వయసు 17 ఏళ్లు అని గుయుఫ్రే చెప్పారు. తాను డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మార్ ఏ లాగో క్లబ్‌లో మసాజర్‌గా పనిచేసే దాన్ని.. అటు తర్వాత తనను ఎఫిస్టిన్ వద్ద పనికి కుదర్చారు. తన పని ఎఫిస్టన్ వద్దకు వచ్చే వారి సెక్సువల్ కోరికలు తీర్చడమేనని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి 2019లో 2,000 పేజీలను బహిర్గం చేశారు. అటు తర్వాత 2020, 2021, 2022లో ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం బహిర్గతం చేసింది కోర్టు మరో 250 పేజీలను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పత్రాల్లో చాలా వరకు ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన న్యూస్‌పేపర్ కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో ఎప్‌స్టీన్ సాన్నిహిత్యం, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల వంటి వివరాలు వీటిలో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో పాప్ ఐకాన్ మైఖెల్ జాక్సన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా దాదాపు 200 మంది ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం.