Home /Author anantharao b
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జిని ముంబైలో ప్రారంభించారు. కాగా ఈ బ్రిడ్జికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పెట్టారు. 21.8 కిలోమీటర్ల ఆరులేన్ల బ్రిడ్జికి 18వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఒక లక్షా 77వేల 903 మెట్రలిక్ టన్నుల ఉక్కును వినియోగించారు.
ఆసియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలువబడే బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ గురువారం ఒక ఇంటివాడయ్యాడు. అతను అనీషా రోస్నాఅనే సామాన్యురాలిని పెళ్లాడటంతో ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. బందర్ సెరీ బెగవాన్‌లోని బంగారు గోపురం సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదులో ఈ వివాహం జరిగింది.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్‌తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్‌ను వినియోగించారు.
భువనగిరి పార్లమెంట్ నేతల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు షెడ్డుకు వెళ్లలేదు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్నారు. పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.. ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అంగీకరించారు.
జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం నుంచి ఐదు లక్షల లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం తెలిపారు.స్వామి వివేకానంద దినోత్సవం సందర్బంగా ఒక పాఠశాలలో ఆయన మంత్రులతో కలిసి సూర్య నమస్కారాలు నిర్వహించారు.
శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో జరిగిన 'స్వచ్ఛత అభియాన్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా దేవాలయాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు (క్లీన్‌నెస్ డ్రైవ్‌లు) నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్లో ఓ కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజులుగా కరీంనగర్ రెండో డిపోలో బందీగా ఉన్న కోడిపుంజును ఆర్టీసీ అధికారులు వేలం వేయనున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఎవరో కోడిపుంజును మర్చిపోయారు. దీనితో దీనిని వేలం వేయాలని నిర్ణయించారు.
మోదీ సర్కార్ రెండవసారి పరిపాలనలో చివరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను వెల్లడించారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య అభిలషించారు.