Budget Meetings: జనవరి 31నుంచి బడ్జెట్ సమావేశాలు
మోదీ సర్కార్ రెండవసారి పరిపాలనలో చివరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Budget Meetings: మోదీ సర్కార్ రెండవసారి పరిపాలనలో చివరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మధ్యంతర బడ్జెట్..(Budget Meetings)
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టేందుకు నిబంధనలు అంగీకరించవు. దీంతోమధ్యంతర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద భూ యజమానులైన మహిళా రైతులకు సంవత్సరానికి చెల్లిస్తున్న 6 వేల రూపాయలని 12 వేలకు పెంచే ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 12 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.