Home /Author anantharao b
ఏపీలో అధికార వైసీపీ పార్టీకీ మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ట్రస్టు ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌కు చైర్మన్‌గా శనివారం నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సీటు షేరింగ్ ఎజెండా, "భారత్ జోడో న్యాయ్ యాత్ర"లో పాల్గొనడం మరియు కూటమికి సంబంధించిన ఇతర విషయాలను సమీక్షించడానికి ఇండియా బ్లాక్ నాయకులు వర్చువల్ మీటింగ్‌ను ఈరోజు నిర్వహించారు.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో పది మంది మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు శనివారం తెలిపారు. దీనిని బొగ్గు మరియు గ్యాస్ పేలుడు విస్ఫోటనం గా వర్ణించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:55 గంటలకు పింగ్డింగ్షాన్లో ఈ ప్రమాదం జరిగింది.
నేపాల్‌లోని లుంబినీ ప్రావిన్స్‌లో ఉన్న రప్తి నదిలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులతో సహా కనీసం 12 మంది మరణించారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, బస్సు నేపాల్‌గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా, భలుబాంగ్‌లోని రప్తి వంతెనపై నుండి ఈస్ట్-వెస్ట్ హైవే వెంబడి నదిలోకి పడిపోయింది.
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీ వివరాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేన బలంగా ఉన్న చోట్ల కనీసం 40 స్థానాలకి తగ్గకుండా చూడాలని పవన్ కళ్యాణ్‌ని కోరానని జోగయ్య వెల్లడించారు.
తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్‌కు 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆయన అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటు చేసుంది. అచ్చంపేటకు చెందిన సింధు అనే వివాహిత మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధవులు సింధు మృతికి ఆమె భర్త నాగార్జున కారణమని భావించారు. నాగార్జునను బంధువులు ఆమనగల్ వద్ద ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. ఈ నెల 18న తన కుమారుడు రాజారెడ్డి- అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్కి, ఫిబ్రవరి 17న జరుగబోయే ఎంగేజ్మెంట్కి రావాలని చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చెప్పారు.
బీజేపీతో పొత్తు గతంలో లేదని, భవిష్యత్‌లో కూడా ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీకి బి టీం కాదని కెటిఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.