Home /Author anantharao b
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్ తో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సూచీలను కిందకు లాగాయి. దీంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ 1600 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 21,250 దిగువకు చేరింది. సోనీ కంపెనీతో డీల్ రద్దవడంతో జీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. గంటా రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా కాలం క్రితమే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త పార్లమెంట్ భవనంలో సందర్శకులు, సామాన్లను తనిఖీ చేయడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరిస్తున్నారు. జనవరి 31 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నుండి సందర్శకులను,వారి సామాను తనిఖీ చేయడానికి కొత్త చర్యలో భాగంగా 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం గౌహతినగరంలోకి రాకుండా నిలిపివేశారు.
సీఎం జగన్ మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 6,394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ ఆసరా పథకంతో 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు తన రాష్ట్ర పర్యటనను మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా శ్రీకాకుళం చేరుకున్న ఆమె ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి బస్సులో ప్రయాణించారు.
ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం నాడు గాజా స్ట్రిప్‌లో తమ సైనికులలో 21 మంది మరణించినట్లు ప్రకటించింది, ఇది హమాస్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు
వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నేడు వైసీపీకి రాజీనిమా చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా వల్ల అనిశ్చితి రాలేదు.. ఇందుకు తాను బాధ్యుడుని కాదని ఆయన అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో 42 రోజులనుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్య బద్దంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధులనుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందన్నారు.