Train Derailed : ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఆరు రైళ్లు రద్దు
ప్రస్తుతం దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు.. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల
Train Derailed : ప్రస్తుతం దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు.. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
విశాఖ- లింగంపల్లి (12805)-జన్మభూమి, విశాఖ-విజయవాడ (22701)-ఉదయ్, విశాఖ-గుంటూరు(17240)- సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇవాళ రద్దు చేశారు. అదే రైళ్ల తిరుగు ప్రయాణం కూడా రద్దయింది. విశాఖ- సికింద్రాబాద్ (20833)-వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా వెళ్లింది. విశాఖ నుంచి ఉదయం 5.45కి బయల్దేరాల్సిన వందేభారత్.. 8.45కి బయల్దేరింది. విశాఖతో పాటు దువ్వాడ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అదేవిధంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విశాఖ పట్టణం నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు ఉదయం 8.45కి బయలుదేరింది. మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరోవైపు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్‌కు మరమ్మతు చేపట్టారు.
“Cancellations and Rescheduling of Trains” @RailMinIndia @drmvijayawada pic.twitter.com/BmFM8bV3XI
— South Central Railway (@SCRailwayIndia) June 14, 2023