Last Updated:

CM KCR: ప్రధానులు మారిన.. పార్టీలు మారిన.. దేశంలో మార్పు రాలేదు- కేసీఆర్

CM KCR: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకు అనుగుణంగానే నిర్వహించిన తొలి సభ సక్సెసైంది. ఈ సభలో మాట్లాడిన దేశాభివృద్దే లక్ష్యంగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో నాందేడ్‌ లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సభలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

CM KCR: ప్రధానులు మారిన.. పార్టీలు మారిన.. దేశంలో మార్పు రాలేదు- కేసీఆర్

CM KCR: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకు అనుగుణంగానే నిర్వహించిన తొలి సభ సక్సెసైంది. ఈ సభలో మాట్లాడిన దేశాభివృద్దే లక్ష్యంగా మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో నాందేడ్‌ లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సభలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

దేశంలో విప్లవాత్మక మార్పులు..

ఈ సందర్భంగా కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ.. దేశ పరిస్థితులను చూసే.. తెరాసను భారాసగా మార్చామని తెలిపారు.

దేశంలో సమూల మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో అడుగు ముందుకు వేసినట్లు తెలిపారు.

తెలంగాణలో కాకుండా.. మెుదటిసారిగా బీఆర్ఎస్ సభ నిర్వహించింది. ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు భారాసలో చేరారు.

వారికి కండువా కప్పి.. పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిన ఇంకా అభివృద్ధి జరగలేదని కేసీఆర్ (Cm Kcr ) అన్నారు. ప్రభుత్వాలు మారిన.. పార్టీలు మారిన ఏమాత్రం మార్పు లేదన్నారు.

దేశాన్ని అభివృద్ధి చేస్తామని.. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ దేశంలో ఎక్కడా మార్పు రాలేదన్నారు.

దేశంలో కనీసం తాగునీరు, విద్యుత్‌ ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

అందుకే అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ముందుకు వచ్చామని కేసీఆర్ అన్నారు.

భారాసతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని కేసీఆర్ తెలిపారు. నాగలి పట్టిన చేతులు.. శాసనాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు.. సామాన్యూలు, రైతులు గెలవాలని సీఎం ఆకాంక్షించారు.

 

కాంగ్రెస్, భాజపా పై విమర్శలు..

భారత దేశం.. పేదది కాదని.. అమెరికా కన్న ధనిక దేశమన్నారు.

దేశంలో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికి.. వాటిని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కేసీఆర్ అన్నారు.

నాయకుల చేతుల్లో ప్రజలు వంచనకు గురవుతున్నారని కేసీఆర్ విమర్శించారు. భారతదేశంలో ఉన్న సాగు భూమి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.

ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, భాజపాలు దేశానికి ఏం చేశాయని కేసీఆర్ ప్రశ్నించారు. పుష్కలంగా నదులు ఉన్న మహారాష్ట్రలో కరవు ఎందుకు వస్తుందని కేసీఆర్ అన్నారు.

రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడం లేదని.. ట్రైబ్యునళ్ల పేరుతో కాలం గడుపుతున్నారని కేసీఆర్ విమర్శించారు.

కృషి చేస్తే.. దేశంలోని ప్రతి ఎకరాను సాగు నీరు అందివ్వొచ్చని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ సమస్య లేకుండా అభివృద్ధి చేశామని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఘనత తమదేనని ప్రకటించారు.

భారాస అధికారంలోకి వస్తే.. రెండెళ్లలో దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తామని కేసీఆర్ అన్నారు.

ప్రజలు అభివృద్ధిను చూసి ఓటు వేయాలని.. పార్టీ జెండాలు చూసి కాదని అన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/