Honesty: హోంగార్డ్ నిజాయితీ
పని చేసే ఉద్యోగం ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు. ఉద్యోగ బాధ్యతలు ఏ మేరకు నిర్వహించామో అన్నది ప్రధానం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా అడపా దడపా ప్రశంసలు కూడా అందుకొంటుంటారు. వీరిలో ఒకరిగా హైదరాబాదు హోంగార్డ్ తన నిజాయితీని ప్రదర్శించి అందరి మన్నన్నలు అందుకొన్నాడు
Homeguard Venkateswarllu: పని చేసే ఉద్యోగం ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు. ఉద్యోగ బాధ్యతలు ఏ మేరకు నిర్వహించామో అన్నది ప్రధానం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా అడపా దడపా ప్రశంసలు కూడా అందుకొంటుంటారు. వీరిలో ఒకరిగా హైదరాబాదు హోంగార్డ్ తన నిజాయితీని ప్రదర్శించి అందరి మన్నన్నలు అందుకొన్నాడు..
వివరాల్లోకి వెళ్లితే, ఒడిశాకు చెందిన నిఖిత సాహు అనే యువతి బస్సులో ప్రయాణిస్తూ విలువైన పర్సును ఖైరతాబాదు సమీపంలోని రవీంద్రభారతి కూడలి వద్ద పోగొట్టుకొనింది. గమనించిన పాదచారులు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు వెంకటేశ్వర్లుకు పర్సును అప్పగించారు.
పరిశీలించిన హోంగార్డుకు పర్సులో కొంత నగదు, బ్యాంకు ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించాడు. దాని ఆధారంగా బ్యాంకుకు వెళ్లి ఖాతాలోని యువతి ఫోన్ నెంబరు సేకరించాడు. నిఖిత సాహూకు సమాచారం చేరవేశాడు. అనంతరం ఆమెకు పర్సును పదిలంగా అప్పచెప్పాడు.
హోంగార్డు చేసిన మంచి పనిని అధికారులు అభినందించారు. నిజాయితి అంటే ఇలా గదా ఉండాలి అని అందరితో ప్రశంసలు అందుకొన్నాడు.
ఇది కూడా చదవండి: Customs: 27కోట్ల విలువైన వాచ్…ఎక్కడ పట్టుబడింది అంటే?