Published On:

HCU: సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. పాటలు, నినాదాలతో ఘోరంగా ట్రోల్స్!

HCU: సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. పాటలు, నినాదాలతో ఘోరంగా ట్రోల్స్!

High Tension at Hyderabad Central University: హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ నినాదాలతో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనకు ఏబీవీపీతో సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హెచ్‌సీయూ వైపు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు.

 

ఇదిలా ఉండగా, హెచ్‌సీయూలో భూములను దున్నడంపైప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంచ గచ్చిబౌలి భూముల వివాదాం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భూములను రక్షించాలని విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

 

ఈ విషయంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. ఈ భూముల హక్కులను హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం దక్కించుకుందన్నారు. ఇందులో ఒక్క అంగుళం కూడా హెచ్‌సీయూకి చందినది కాదన్నారు. ఈ విషయంలో ఎవరైనా వివాదాలు సృష్టిస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు.

 

అయితే కొంతమంది ప్రతిపక్షాల నాయకులు కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ భూముల్లో చేపట్టే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం ఛేయడం ఏంటని ప్రశ్నించారు.