MLC Election Results: ఎమ్మెల్సీ ఫలితాల్లో సంచలన విజయాలు.. గెలిచిందెవరంటే?

MLC Election Results: తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాల్లో సంచలన విజయాలు నమోదయ్యాయి. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. మరో చోట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలు పొందారు. ఈ రెండో చోట్లా సిటింగ్ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు.
మరోవైపు ఉమ్మడి కరీంన గర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 10 గంటల తర్వాతే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకా చెల్లిన, చెల్లని ఓట్లను వేరుచేస్తున్నారు. ఈ ప్రక్రి యకు మరింత సమయం పట్టనుండడంతో కౌంటింగ్ ఆలస్యం కానుంది. ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో భారీగా ఓట్లు చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా.. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో, నల్గొండ జిల్లాలోని ఆర్దాలబా విలో కౌంటింగ్ జరిగింది.
కాగా, కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. ఎలిమినేషన్ లేకుండానే మొదటి ప్రాధాన్యత కావాల్సిన కోటా కింద 12,959 ఓట్లు సాధించారు. ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థులను కూడా మల్క కొమురయ్య ఓడించి.. 12 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇందులో మొత్తం 25,041 ఉపాధ్యాయుల ఓట్లు పడగా.. 24,144 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. అందులో 897 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. కానీ విజయం సాధించేందుకు 12,073 ఓట్ల కావాల్సి ఉండగా.. మల్క కొమరయ్యకు 12,959 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఘన విజయం సాధించారు. అయితే ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘో త్తమ్ రెడ్డికి కేవలం 429 ఓట్లు మాత్రమే పోలవటం గమనార్హం. ఈ స్థానం నుంచి బరిలో నిలిచిన వంగ మహేందర్ రెడ్డికి 7,182, అశోక్ కుమార్కు 2,621 ఓట్లు వచ్చాయి.
ఇక, నల్గొండ-ఖమ్మం – వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేప ట్టగా.. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానంలో నర్సిరెడ్డి రెండో స్థానంలో, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్, నాలుగో స్థానంలో మరో స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్, ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి నిలిచారు.
ఇదిలా ఉండగా, మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కరీంనగర్లో ఈ ఓట్లు లెక్కింపు చేపడుతున్నారు. అయితే నేటికీ లక్ష ఓట్లు ప్రాథమిక లెక్కింపు జరగగా.. అందులో 8,000 ఓట్లను చెల్లనివిగా అధికారులు గుర్తించారు. మరో 1,50,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.